Begin typing your search above and press return to search.

ఈసీ చేతిలో కోదండ‌రామ బాణం

By:  Tupaki Desk   |   22 Feb 2018 11:54 AM GMT
ఈసీ చేతిలో కోదండ‌రామ బాణం
X
తెలంగాణ జేఏసీ ఛైర్మ‌న్ ఫ్రొఫెస‌ర్ కోదండ‌రాం పార్టీ పేరును తెలంగాణ జ‌న స‌మితిగా ఖరారు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. అంతేకాదు పార్టీ కి బాణం గుర్తు ఇవ్వాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఆ లేఖ‌పై ఎన్నిక‌ల క‌మిష‌న్ గ్రీన్ సిగ్నిల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

ప్రొఫెసర్ ముద్దసాని కోదండ రామిరెడ్డి స్వరాష్ట‌మే ల‌క్ష్యంగా పోరాటం చేసిన వ్య‌క్తి . తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాట సమయంలో తన ఉద్యోగాన్ని పక్కనపెట్టి పల్లెపల్లెల్లో తిరుగుతూ ఉద్యమ స్ఫూర్తి నింపిన వ్యక్తి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయనకు సముచితమైన గౌరవం దక్కడం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. అంతేకాదు గత కొంతకాలంగా టీఆర్ ఎస్ ప్రభుత్వానికి కోదండరాంకు మధ్య పెద్ద యుద్ధమే జ‌రుగుతుంది.

ఒకానొక సంద‌ర్భంలో సీఎం కేసీఆర్ పై - టీఆర్ ఎస్ పార్టీ పై విమ‌ర్శ‌లు చేశారు. కేసీఆర్ అధికారంలో వ‌చ్చిన నాటి నుంచి ప‌ల్లె ప‌ల్లె తిరుగుతూ ప్ర‌భుత్వం ప‌రిపాల‌న‌ను అధ్య‌యనం చేస్తున్నారు. ఆ అధ్య‌యనంలో ప్ర‌భుత్వ తీరును నిర‌సించిన కోంద‌డ‌రాం .“ఎద్దు ఏడ్చిన ఎవుసం - రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడవు అంటూ కీల‌క వ్యాఖ్య‌లు కూడా చేశారు. అంతేకాదు.

తెలంగాణ ప్ర‌జ‌ల జీవితాల‌ను బాగు చేయ‌డం చేత‌కాక‌పోతే పక్కకు తప్పుకోండంటూ దుయ్య‌బ‌ట్టారు. కేసీఆర్ ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల నిర్ణ‌యాన్ని కోదండ‌రాం త‌ప్పు బ‌ట్టారు. ఇక ప్ర‌భుత్వ తీరును చూస్తూ ఉండ‌బ‌ట్ట‌లేని కోదండ‌రాం కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటానికి దిగారు. ఈ నేపథ్యంలో కోదండ‌రాం త్వరలోనే కొత్త పార్టీని ప్రారంభించబోతున్నారు. తన పార్టీ పేరు - గుర్తు - తదితర వివరాలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయిన‌ట్లు జేఏసీ నేత‌లు చెబుతున్న‌మాట‌.

అందుకు ఊతం ఇచ్చేలా కోదండం రామ్ ఈసీకి లేఖ రాశారు. త‌న పార్టీకి తెలంగాణ జ‌న‌స‌మితి పేరును ఖ‌రారు చేసిన‌ట్లు..పార్టీకి గుర్తుగా బాణాన్ని కేటాయించాల‌ని కోరారు. దీనిపై ఎన్నిక‌ల సంఘం సానుకూలంగా స్పందించిన‌ట్లు టాక్. అంతేకాదు జాతీయ రాజకీయాల నిపుణుడు యోగేంద్ర యాదవ్‌తో...కోదండరాం పార్టీ స్థాప‌న గురించి ప‌లుమార్లు సంప్ర‌దించార‌ట‌.

అయితే పార్టీ ప్ర‌క‌ట‌న మార్చి 10న తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టమైన మిలియన్‌ మార్చ్‌కి ప్ర‌క‌ట‌న చేస్తే బాగుంటుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మైన‌ట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీజేఏసీ స్టీరింగ్‌ కమిటీ నిర్ణయం ప్రకారం నూతన పార్టీ ఆవిర్భావ ఏర్పాట్లు చక్కబెట్టడానికి 200 మందితో కమిటీ ఏర్పాటైంద‌ని తెలుస్తోంది. దీంతో స‌భ‌లు , స‌మావేశాలు, తెలంగాణ ఉద్య‌మంలో త‌న‌కు అండ‌గా ఉన్న నేత‌లు, త‌న శిష్యులుగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంత‌మంది నేత‌లతో కోదండ‌రాం సీక్రెట్ మంత‌నాలు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది.

ఓ వైపు కోదండ రామ్ పార్టీ ఏర్పాటు చేసే ప‌నిలో ఉండ‌గా ..టీఆర్ ఎస్ పార్టీకి చెందిన కొంత‌మంది నేత‌లు ఆరా తీస్తున్న‌ట్లు టాక్ న‌డుస్తోంది. కోదండ‌రామ్ పార్టీ ప్ర‌క‌ట‌న‌ను ఆహ్వానిస్తూనే ...ఆ పార్టీ ఉనికి ఎలా ఉండ‌బోతుంద‌నే విష‌యంపై చ‌ర్చించుకుంటున్నార‌ట‌. అంతేకాదు వారిలో దాదాపు 20మంది కీల‌క నేత‌లు కోదండ‌రామ్ వెంట న‌డిచేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు . ఆ నేత‌ల‌తో కూడా పార్టీ ప్ర‌క‌ట‌న‌పై చేర్చి...పార్టీ కండువా క‌ప్పేందుకు సిద్ధ‌మ‌య్యార‌ట ప్రొఫెస‌ర్ కోదండ‌రాం.