Begin typing your search above and press return to search.

కోడెల మ‌రింత‌గా ఇరుక్కుపోయారు

By:  Tupaki Desk   |   30 Jun 2016 6:35 AM GMT
కోడెల మ‌రింత‌గా ఇరుక్కుపోయారు
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు చుట్టు చిక్కులు బిగుసుకుంటున్నాయి. ఆయ‌న‌పై వచ్చిన అధికంగా ఎన్నికల వ్యయం ఆరోపణలపై పూర్తిస్థాయి నివేదిక సిద్దం చేయడంపై ఎన్నికల అధికారులు దృష్టి సారించారు. దీంతో టీవీ చాన‌ల్ లో కోడెల చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న‌కు ఇబ్బందిగా మార‌డం స్ప‌ష్ట‌మ‌ని తేలిపోతున్న‌ది.

2014లో జరిగిన ఎన్నికల్లో తాను 11 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు స్వయంగా కోడెల చెప్పినట్లు వార్తా కథనాలు ప్రసారమైన నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఐదు ఫిర్యాదులు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయానికి వచ్చాయి. ఇందులో ఒకటి నేరుగా వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాగా, మరో నాలుగు ఫిర్యాదులు పోస్టులో వచ్చినట్లు సీఈఓ భన్వర్‌ లాల్‌ వెల్లడించారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో వాస్తవాలపై ఎన్నికల అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు. కోడెల చేసిన వ్యాఖ్యలు ఎలక్ట్రానిక్‌ మాధ్యమాల్లో రావడంతో వాటి వీడియోలను కూడా అధ్యయనం చేస్తున్నారు. ఈ వివాదానికి సంబంధిరచి పత్రికల్లో వచ్చిన వార్తల వివరాలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ వివరాలు ఆంగ్ల భాషలోకి తర్జుమా చేసి ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాలని నిర్ణయించారు. ఈ క్ర‌మంలోనే వైకాపా ప్రతినిధులు రోజా - అంబటి రాంబాబు ఇచ్చిన వీడియో క్లిప్పింగ్‌ లను కూడా పరిశీలిస్తున్నారు. దీంతోపాటుగా మరో నలుగురు వ్యక్తిగతంగా కూడా కోడెల శివప్రసాదరావుపై చేసిన ఫిర్యాదులను రాష్ట్ర ఎన్నికల అధికారులు అధ్యయనం చేస్తున్నారు.