Begin typing your search above and press return to search.
ఆ పార్టీలను రద్దు చేస్తాం.. అధికారం ఇవ్వండి: ఎన్నికల సంఘం డిమాండ్!
By: Tupaki Desk | 27 Jun 2022 2:30 AM GMTకేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రతిపాదన చేసింది. రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ను రద్దు చేసే అధికారం తమకు ఇవ్వాలని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖను కోరింది. ఎన్నికల సంఘానికి ఈ అధికారాన్ని ఇస్తే అక్రమాలకు పాల్పడే రాజకీయ పార్టీలను నిరోధించవచ్చని తెలిపింది.
ఎందుకు రద్దు చేయాలంటే..
కొందరు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పొందేందుకే పార్టీలను రిజిస్టర్ చేస్తున్నారని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. చాలా పార్టీలు ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేసుకుంటున్నాయి కానీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని గుర్తు చేసింది. రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చేటట్లు ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలని కేంద్ర న్యాయ మంత్రి త్వ శాఖను ఎన్నికల సంఘం కోరింది. ప్రస్తుతం దేశంలో 8 జాతీయ పార్టీలు, 50కి పైగా ప్రాంతీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు పొందాయి. 2,800 పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేసుకున్నాయి.
అడ్రస్‌లేని 198 గుర్తింపులేని నమోదిత రాజకీయ పార్టీలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని రోజుల క్రితం ప్రకటించింది. ఏదైనా రాజకీయ పార్టీగా నమోదు చేసుకున్న సంస్థకు తపాలా చిరునామా తప్పనిసరి. అందులో మార్పులు ఉంటే తప్పనిసరిగా ఆ విషయాన్ని ఎన్నికల సంఘానికి తెలియజేయాల్సి ఉంటుంది.
అయితే చాలా రాజకీయ పార్టీలకు తాము పంపిన వర్తమానాలు అవి పేర్కొన్న చిరునామాల్లో చేరడం లేదని గుర్తించిన ఎన్నికల సంఘం వాటి గురించి సంబంధిత రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారులతో విచారణ జరిపించింది. వారు సమర్పించిన నివేదికలు, ఎన్నికల సంఘం పంపిన లేఖలు ఆయా పార్టీలకు చేరకపోవడం గురించి పోస్టల్ యంత్రాంగం చెప్పిన వివరాలను ఆధారంగా చేసుకొని కేంద్ర ఎన్నికల సంఘం 198 పార్టీలను రద్దు చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇది వివాదంగా మారింది. దీంతో కేంద్ర న్యాయశాఖకు.. ఎన్నికల సంఘం అప్పీల్ చేసింది. మరి దీనిపై కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.