Begin typing your search above and press return to search.

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల‌

By:  Tupaki Desk   |   14 Jun 2017 11:18 AM GMT
రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల‌
X
త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 28వరకూ నామినేషన్లను స్వీకరించనున్నారు. జూలై 17న ఎన్నిక జరగనుంది. కౌంటింగ్ 20న జరగనుంది. నోటిఫికేష‌న్ విడుద‌ల‌వ‌డంతో రాష్ట్ర‌ప‌తి అభ్యర్థి ఎంపిక ప్ర‌క్రియ‌ను అధికార‌ - విప‌క్షాలు వేగ‌వంతం చేశాయి.

కేంద్ర హోంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ ని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖా మంత్రి వెంకయ్యనాయుడు కలిశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రపతి ఎన్నికలపై రాజ్‌ నాథ్‌ తో చర్చించారు. పారా మిలటరీ బలగాల కర్బం ఫండ్‌ కు కోటి రూపాయల చెక్ ను రాజ్‌ నాథ్‌ కు అందజేశారు.

రాష్ట్రపతి అభ్యర్థిని ఎన్నుకునేందుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ముగ్గురు సభ్యుల కమిటీని నియమించారు. ఆ కమిటీలో వెంకయ్యనాయుడు - అరుణ్ జైట్లీ - రాజ్‌ నాథ్ సింగ్ ఉన్నారు. ఎన్డీఏ భాగస్వాములతోపాటు విపక్షాలతో కూడా ఈ క‌మిటీ చర్చలు జరుపుతోంది.

మూడేళ్ల కాలంలో బీజేపీ ఏకపక్ష ధోరణి వ‌ల్ల అస‌హ‌నంతో ఉన్న విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాల‌ని భావిస్తున్నాయి. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు అందుకు స‌రైన సంద‌ర్భం అని భావిస్తున్నాయి. మొత్తానికి ఈ ఎన్నిక‌ల్లో తటస్థ పార్టీల వైఖ‌రి అధికార‌, విప‌క్షాల‌కు కీల‌కంగా మార‌నుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/