Begin typing your search above and press return to search.

బాబు నిరసనపై స్పందించిన ఈసీ

By:  Tupaki Desk   |   10 April 2019 10:48 AM GMT
బాబు నిరసనపై స్పందించిన ఈసీ
X
ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ కు ఒక రోజు ముందు ఏపీ రాజధానిలోనాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం అనుసరిస్తున్న వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్నికల సంఘం కమిషనర్ కార్యాలయం ఎందుట ధర్నా చేశారు. అనంతరం ఈసీని కలిసి తమ ఫిర్యాదును ఆయనకు అందజేశారు.

రాష్ట్ర ఈసీని కలిసి నిరసన తెలపటం.. ఫిర్యాదు చేయటం.. పార్టీ నేతల్ని వెంట పెట్టుకొని హడావుడి చేయటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరే రాష్ట్రంలో లేని రీతిలో అధికారపక్షంపై ఈసీ వేధిస్తోందన్న అభిప్రాయాన్ని టీడీపీ నేతలు..కార్యకర్తలు ఆరోఫిస్తున్నారు. మరోవైపు.. ఇలాంటివి జరుగుతాయని తాము అనుకున్నామని.. అందుకు తగ్గట్లే నిరసన డ్రామాను బాబు చేపట్టారంటూ జగన్ పార్టీ నేతలు మండిపడుతున్నారు.

ఐదేళ్ల పాలనలో ఏమీ చేయని బాబు.. ఈ రోజు ప్రజా వ్యతిరేకతను చూసి.. ఈసీని వేలెత్తి చూపిస్తూ డ్రామాలు ఆడుతున్నట్లుగా వారు విమర్శిస్తున్నారు. ఇలాంటి నిరసనలతో సానుభూతి పెంచుకోవాలని బాబు ప్రయత్నిస్తున్నారని.. ఇలాంటివేమీ వర్క్ వుట్ కావంటున్నారు.

ఇదిలా ఉంటే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఫిర్యాదుపై ఏపీ ఎన్నికల ముఖ్య అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పందించారు. తాము కేంద్ర ఎన్నికల సంఘం సూచనల్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఎవరి తరఫున పని చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం తమకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికల నిర్వహణలో తాము నిష్పాక్షికంగా పనిచేస్తున్నామని, తమ మీద ఎవరి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. ద్వివేది వివరణపై బాబు సమాధానపడలేదు.