Begin typing your search above and press return to search.
ఆరు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్.. లిస్టులో ఉన్న రాష్ట్రాలివే..
By: Tupaki Desk | 9 Sep 2021 9:42 AM GMTఆరు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. అసోం, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన ఆరు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది.అక్టోబర్ 4న ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు బీహార్‌లో ఒక శాసనమండలి స్థానానికి కూడా ఉప ఎన్నిక అక్టోబర్ 4న జరగనుంది. పశ్చిమ బెంగాల్లో మానస్ రంజన్ భూటియా, అసోంలో బిస్వజిత్, తమిళనాడులో కేపీ మునుస్వామి, ఆర్. వైద్యలింగం, మధ్యప్రదేశ్ నుంచి ధావర్ చంద్ గెహ్లోత్ రాజీనామా చేశారు.
అసోం, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఖాళీ అయిన 6 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈసీ షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 4న ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 15న జారీ కానుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఒక ప్రకటన జారీ చేసింది. ఇక పుదుచ్చేరి రాజ్యసభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎన్ గోకులకృష్ణణ్ పదవీకాలం అక్టోబర్ 6 తో ముగియనుంది. ఈ స్థానానికి కూడా ఉప ఎన్నికలతో పాటే ఎన్నిక నిర్వహిస్తామని ఈసీ తాజా షెడ్యూల్ లో వెల్లడించింది. మహారాష్ట్రకు చెందిన రాజ్యసభ సభ్యుడు రాజీవ్ శంకర్రావ్ సతావ్ అకాల మరణం చెందారు. దీంతో ఈ ఆరు స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది.
ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్ జారీ సెప్టెంబర్ 15,
నామినేషన్లకు చివరి తేదీ సెప్టెంబర్ 22,
నామినేషన్ల పరిశీలన సెప్టెంబర్ 23,
నామినేషన్ల విత్ డ్రా చేసుకోవడానికి ఆఖరి తేదీ సెప్టెంబర్ 27,
ఉప ఎన్నికలు జరిగే తేదీ అక్టోబర్ 4,
ఎన్నికల సమయం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు,
ఓట్ల లెక్కింపు తేదీ అక్టోబర్ 4.