Begin typing your search above and press return to search.

కేసీఆర్ బొందుగాళ్ల మాట త‌ప్పేన‌న్న ఈసీ.. ఇక‌పై జాగ్ర‌త్త‌!

By:  Tupaki Desk   |   4 May 2019 5:15 AM GMT
కేసీఆర్ బొందుగాళ్ల మాట త‌ప్పేన‌న్న ఈసీ.. ఇక‌పై జాగ్ర‌త్త‌!
X
లోక్ స‌భ ఎన్నిక‌ల ప్ర‌చార నేప‌థ్యంలో హిందుగాళ్లు.. బొందుగాళ్లు అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించాయో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ వ్యాఖ్య‌ల్ని ప‌లువురు పెద్ద ఎత్తున త‌ప్పు ప‌ట్టారు. కేసీఆర్ వ్యాఖ్య‌ల‌పై కొంద‌రు అభ్యంత‌రం వ్య‌క్తంచేస్తూ.. ఆయ‌న మాట‌లు ఎన్నిక‌ల నియ‌మావ‌ళికి విరుద్ధంగా ఉన్నాయ‌ని.. చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు.

దీనిపై తాజాగా ఈసీ స్పందించింది. క‌రీంన‌గ‌ర్ స‌భ‌లో కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు త‌ప్పేన‌ని తేల్చింది. ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌న నియామ‌వాళికి క‌ట్టుబ‌డి ఉండాల‌ని కేసీఆర్ ను కోరింది. తాజాగా ఈసీ విడుద‌ల చేసిన ఉత్త‌ర్వుల్లో.. మార్చి 17న క‌రీంన‌గ‌ర్ స‌భ‌లో కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళికి విరుద్ధంగా ఉంద‌ని తేల్చింది.

హిందుగాళ్లు.. బొందుగాళ్లు అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌పై ఈసీ ఆయ‌న వివ‌ర‌ణ కోర‌గా.. కేసీఆర్ త‌న వాద‌న‌ను వినిపించారు. దీన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న ఎన్నిక‌ల సంఘం.. రాజ్యాంగ ప్రాథ‌మిక సూత్రాల్ని గౌర‌వించ‌టం.. భార‌త రాజ్యాంగ లౌకిక‌త్వాన్ని కాపాడ‌టంతో పాటు.. దాన్ని బ‌హిరంగంగా.. ప్ర‌సంగాల్లో చూపాల్సిన బాధ్య‌త ఒక గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీ అధ్య‌క్షుడిగా.. ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉన్న కేసీఆర్ మీద ఉంద‌ని పేర్కంది.

ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మ‌వాళి ప్ర‌కారం ఏ రాజ‌కీయ పార్టీ కానీ.. ఏ అభ్య‌ర్థి కానీ కులాలు.. మ‌తాలు.. ప్రాంతాలు.. భాష‌ల ప్రాతిప‌దిక‌న విద్వేషాలు రెచ్చ‌గొట్టేలా ప్ర‌య‌త్నించ‌కూడ‌ద‌న్నారు.

తాజా వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో కేసీఆర్ భ‌విష్య‌త్తులో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని.. ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని త‌ప్ప‌నిస‌రిగా క‌ట్టుబ‌డి ఉండాల‌ని ఈసీ పేర్కొంది. మాటల మ‌రాఠిగా.. ఎంత‌టి వారినైనా త‌న మాట‌ల‌తో క‌న్వీన్స్ చేస్తార‌న్న పేరున్న కేసీఆర్ మాట‌ల‌పై తొలిసారి ఈసీ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌ర‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.