Begin typing your search above and press return to search.

బాల‌య్య‌పై ఈసీ ఫైర్‌.. నివేదిక ఇవ్వాల్సిందేన‌ట‌!

By:  Tupaki Desk   |   20 Aug 2017 4:49 AM GMT
బాల‌య్య‌పై ఈసీ ఫైర్‌.. నివేదిక ఇవ్వాల్సిందేన‌ట‌!
X
నంద్యాల‌లో గెల‌వాల‌ని టీడీపీ ప్ర‌ద‌ర్శిస్తున్న ట్రిక్కులు అన్నీ ఇన్నీ కావ‌న్న వాద‌న వినిపిస్తోంది! డ‌బ్బులు పంచుతూ.. ప్ర‌లోభాలు, బెదిరింపుల‌కు పాల్ప‌డుతూ.. అధికారుల‌ను త‌న చెప్పు చేతల్లో పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతోంద‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్ప‌టికే 25 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇత‌ర నాయ‌కుల ప్ర‌చారం స‌రిపోద‌న్న‌ట్లు.. హిందూపురం ఎమ్మెల్యే - ఏపీ సీఎం చంద్ర‌బాబు బావ‌మ‌రిది బాల‌కృష్ణ‌ను రంగంలోకి దిగిపోయారు. పాపం! బాల‌య్య వ‌స్తాడు.. కార్య‌క‌ర్త‌ల్లో జోష్ నింపుతాడు అని నేత‌లు పెట్టుకున్న ఆశ‌లు ఆవిరైపోయాయి. కాన్వాయ్‌ పై నుంచే ప్ర‌జ‌ల‌కు డ‌బ్బులు పంచుతూ.. బాల‌య్య‌ రెడ్ హ్యాండెడ్‌ గా దొరికిపోయాడు. ఇది ఆయ‌న్ను ఇప్పుడు తీవ్ర చిక్కుల్లో ప‌డేసింది. దీనిపై ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌.. సీరియ‌స్‌ గా స్పందిస్తోంది.

ఏపీ సీఎం చంద్రబాబు వియ్యంకుడు - ఎమ్మెల్యే బాలకృష్ణ ఇప్పుడు చిక్కుల్లో ప‌డ్డారు. నంద్యాల ఎన్నికల ప్రచారానికి వ‌చ్చిన ఆయ‌న‌.. డ‌బ్బులు పంపిణీ చేయ‌డం - అవ‌న్నీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వ‌డం అన్నీ తెలిసిందే! దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌ అయ్యింది. ఈ ఘటనపై వెంటనే రిపోర్టు ఇవ్వాలని కలెక్టర్‌ ను ఆదేశించింది. ప్రభుత్వ కార్యక్రమాలను రోడ్‌ షోలో ఏకరువు పెట్టిన బాలకృష్ణ.. అభివృద్ధి కోసం టీడీపీకి ఓటెయ్యాలని నంద్యాల ప్రజలను కోరి.. మళ్లీ అదే వాహనం మీది నుంచి వారికి డబ్బులు పంచిన విషయం తెలిసిందే. బాలకృష్ణ డబ్బులు పంచుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ రోడ్‌ షోలో మాట్లాడుతున్నారు.

బాల‌య్య అవేమీ పట్టించుకోకుండా.. డ‌బ్బులు పంచుతూనే కెమెరాకు చిక్కారు! అయితే దీనిపై అధికార పార్టీ నేత‌లెవ‌రూ మాట్లాడ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం! అధికార పార్టీ నేత‌లు విచ్చ‌ల విడిగా డ‌బ్బు పంపిణీ చేస్తున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న వ్యాఖ్య‌ల‌కు ఇవి.. మ‌రింత బ‌లాన్ని చేకూర్చింద‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం ఈసీ నివేదిక కోర‌డంలో ఇప్పుడు బాల‌య్య‌కు ఝ‌ల‌క్ త‌ప్పేలా లేద‌న్న వాద‌న వినిపిస్తోంది!