Begin typing your search above and press return to search.
పంచాయతీ వేలం.. ఈసీ సీరియస్
By: Tupaki Desk | 9 Jan 2019 5:31 AM GMTపంచాయతీల్లో రిజర్వేషన్లు ఆయా వర్గాలకు వరంగా మారాయి. అదే సమయంలో మరికొందరికి అవకాశవాదంగా కూడా మారాయి. రిజర్వేషన్ల వల్ల ఎస్పీ, ఎస్టీ, బీసీల్లో పోటీ తక్కువవుతోంది. జనరల్ స్థానాల్లో ఉన్న పోటీ రిజర్వేషన్ల స్థానాలకు లేకుండా పోయింది.
రిజర్వేషన్ కలిగిన గ్రామాల్లో కొందరు బడా బాబులు వేలం పాటలకు దిగుతున్నారు. తాము గ్రామానికి ఇంత ఇస్తాం తమనే ఎన్నుకోవాలంటూ బేరం పెడుతున్నారు. గ్రామస్థులు కూడా ఎవరు ఎక్కువ ఇస్తే వారికే సర్పంచ్, వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎంపిక చేయడానికి సిద్ధమవుతున్నారు. అందుకే ఇప్పుడు గ్రామాల్లో వేలం పాటలు కూడా ఉధృతంగా సాగుతున్నాయి.
తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి ఈ వేలం పాటలు వచ్చాయి. ఎన్నికల సంఘం దీనిపై దృష్టి సారించింది. ప్రజాస్వామ్యబద్దంగా నాయకులు ఎన్నికవ్వాలని.. ఇలా వేలం ద్వారా డబ్బులతో ప్రజాప్రతినిధులుగా ఎన్నికవ్వడం చట్టవిరుద్ధమని ఈసీ భావిస్తోంది. అందుకే పంచాయతీల్లో వేలం పాటలు నిర్వహిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తాజాగా ప్రకటించింది. అంతేకాదు వేలం పాటల్లో పాల్గొనే అభ్యర్థులకు ఏడాది జైలు శిక్షతోపాటు ఆరేళ్లు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధిస్తామని పేర్కొంటోంది.
వేలం పాటలను నియంత్రించేందుకు తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేస్తోంది. పంచాయతీల వేలం పాటలకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించడానికి.. మీడియాలో వార్తలను ఈ విభాగం నిశితంగా పరిశీలిస్తుంది. ఎన్నికల సంఘం అధికారులతోపాటు పోలీస్ శాఖ కూడా వేలం పాటలపై చర్యలు తీసుకోవడానికి ఈసీ సర్వం సిద్ధం చేస్తోంది. ఏకగ్రీవ పంచాయతీల ఫలితాలను అన్నీ ఓకే అనుకున్నాక రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారని వెల్లడించారు.