Begin typing your search above and press return to search.
హైదరాబాద్ మీద ఈసీ డేగ కన్ను?
By: Tupaki Desk | 30 Oct 2015 4:58 AM GMT‘అధికారం’ అనే దానికి అంతిమ హక్కుదారులు ఎవరూ ఉండరు. అందులోకి ప్రజాస్వామ్య వ్యవస్థలో అది అసాధ్యం కూడా. అధికారం మొత్తం పోగుపడినట్లుగా ఒక్కరి చేతుల్లోనే కేంద్రీకృతం కాకుండా ఉండేందుకు ఎక్కడికక్కడ చెక్ పాయింట్లు ఉంటాయి. అయితే.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోయే పరిస్థితులు తక్కువ కావటంతో చాలా విషయాలు అలా నడిచి పోయే పరిస్థితి. వాస్తవానికి ప్రతి వ్యవస్థ ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా ఉండేందుకు వాటి వేగానికి కళ్లాలు వేసేందుకు నియంత్రించే వ్యస్థలు చాలానే ఉన్నాయి. ప్రతి వ్యవస్థ సరిగ్గా పని చేస్తే ఎలా ఉంటుందన్న విషయం ఇప్పుడు చాలామందికి అర్థమయ్యే ఉంటుంది.
హైదరాబాద్ లో భారీ ఎత్తున ఓటర్లను తీసేశారని.. ఇందులో కొన్ని రాజకీయ పక్షాల జోక్యంతో పాటు.. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించటం కూడా కారణం అంటూ ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పలు పార్టీలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా చేశాయి. అయితే.. రాజకీయ పార్టీలు ఇలాంటి ఫిర్యాదులు చేయటం.. వాటిపై పెద్ద కదలిక లేకుండా ఉండటం మామూలే. అందుకు భిన్నంగా తాజాగా ఎన్నికల సంఘం కదిలింది. ఓటర్ల జాబితా తొలగింపుపై వెల్లువెత్తిన విమర్శలపై కేంద్ర ఎన్నిక సంఘం స్పందించింది. పెద్ద సంఖ్యలో ఓట్లను తొలగించిన ఫిర్యాదులపై మూడు రోజుల పాటు తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం పశ్చిమ బెంగాల్ సీఈవో నేతృత్వంలో ప్రత్యేక బృందం హైదరబాద్ కు చేరుకుంది.
ఓటర్ల గల్లంతుపై తెలుగు రాష్ట్రాల్లో గతంలోనూ ఆరోపణలు వచ్చినప్పటికీ.. అందుకు స్పందన మాత్రం తొలిసారి కనిపించటం విశేషం. మరో మాటగా చెప్పాలంటే ఇది రెండోసారిగా చెబుతున్నారు. 2001లో ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లోక్ సభా స్థానం పరిధిలోని ఠాకూర్ ద్వారా అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఓటర్లను భారీగా తొలగించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కేంద్ర సంఘం స్పందించి.. అప్పటి కార్యదర్శి కేజే రావుతో కూడిన దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఆయన విచారణలో 15,800 మంది ఓటర్ల పేర్లను నిబంధనలకు విరుద్ధంగా తొలగించినట్లుగా తేల్చారు.
దీంతో.. సదరు జిల్లా ఎన్నికల అధికారిని సస్పెండ్ చేయటంతో పాటు.. పలువురు అధికారుల్ని బదిలీ చేశారు. ఠాకూర్ ద్వారా నియోజకవర్గం తర్వాత ఓటర్ల తొలగింపుపై విచారణ బృందాన్ని పంపించటం ఇదేనన్న మాట వినిపిస్తోంది. రాష్ట్రం.. కేంద్రాల్లోని వేర్వేరు రాజకీయ పార్టీల నేపథ్యంలోనే ఇంత కదలిక ఉన్నట్లుగా కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూసినప్పుడు.. ఇంతకాలం ఓటర్ల తొలగింపుపై విపక్షాల వినతులు.. ఫిర్యాదుల్లోని నిజం తాజా విచారణలో తేలనుంది. ఒకవేళ విపక్షాలు ఆరోపించినట్లు కానీ ఓటర్ల తొలగింపు జరిగినట్లు తేలితే మాత్రం అదో సంచలనంగా మారటమే కాదు.. తెలంగాణ అధికారపక్షం ఇరుకున పడటం ఖాయమంటున్నారు.