Begin typing your search above and press return to search.

కేటీఆర్ కు ఈసీ వార్నింగ్ ఇచ్చింది

By:  Tupaki Desk   |   22 Dec 2015 4:24 AM GMT
కేటీఆర్ కు ఈసీ వార్నింగ్ ఇచ్చింది
X
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు ఎదురు దెబ్బ తగిలింది. రాజకీయ ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు ఈ మధ్య కాలంలో విపక్షాలకు చెందిన పలువురు నేతల్ని పార్టీలోకి చేర్చుకోవటం తెలిసిందే. ఈ వైఖరిని ఈసీ తప్పు పట్టింది. ఇలాంటి కార్యక్రమాలు విడి రోజుల్లో అయితే వేరుగా ఉండేది. కానీ.. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో వివిధ పార్టీ నేతలకు గులాబీ కండువాలు కప్పి.. పార్టీలోకి ఆహ్వానిస్తున్న తీరుపై తమకు అందిన ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ స్పందించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తమకు వెంటనే వివరణ ఇవ్వాలని కోరింది.

దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. తన వివరణను అందజేశారు. తన వద్దకు జెడ్పీటీసీలు.. ఎమ్పీటీసీలు రోడ్ల మరమ్మతులకు అవసరమైన నిధుల కోసం వచ్చారని.. వారికి అవసరమైన నిధులు ఇస్తామని మాత్రమే తాను హామీ ఇచ్చినట్లుగా కేటీఆర్ పేర్కొన్నారు. అయితే.. కేటీఆర్ ఇచ్చిన వివరణపై ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. కేటీఆర్ నిబంధనల్ని ఉల్లంఘించారని.. ఇలాంటి మరోసారి చేయొద్దంటూ హెచ్చరిస్తూ వార్నింగ్ ఇచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జెడ్పీటీసీలు.. ఎమ్పీటీసీలు ఓటర్లు అన్న విషయాన్ని మర్చిపోకూడదని ఈసీ చెప్పినట్లుగా చెబుతున్నారు.