Begin typing your search above and press return to search.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నిక‌ల ప‌ర్వం.. షెడ్యూల్ విడుద‌ల‌

By:  Tupaki Desk   |   9 Feb 2023 4:04 PM GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నిక‌ల ప‌ర్వం.. షెడ్యూల్ విడుద‌ల‌
X
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు కీల‌క‌మైన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌లైంది. ఉపాధ్యాయ‌, ప‌ట్ట‌భ‌ద్ర స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ పోటీ ఉన్న విష‌యం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలూ.. ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. ముఖ్యంగా ఏపీ విష‌యానికి వ‌స్తే.. ఎప్ప‌టి నుంచో దీనికి క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. ఓట‌ర్ల గుర్తింపు నుంచి జాబితాల వ‌ర‌కు అనేక వివాదాలు కూడా న‌డిచాయి. ఇక‌, ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా ఫెడ్యూల్‌ విడుద‌ల చేసింది.

తెలంగాణ‌లో..
+ తెలంగాణలో సయ్యద్ అస్సాన్ జాఫ్రి ఎమ్మెల్సీ పదవి కాలం ముగిస్తున్న నేపథ్యంలో షెడ్యూల్‌ వెలువడింది. దీని ప్ర‌కారం ఈ నెల 16న నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్నారు. ఎన్నిక‌ల పోలింగ్‌ మార్చి 13న జ‌ర‌గ‌నుంది. ఫ‌లితం అదే నెల 16 న విడుద‌ల కానుంది.

+ తెలంగాణలో మహబూబ్‌నగర్, రంగారెడ్డి పరిధిలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.

ఏపీలో..

+ ఏపీలో టీచర్ ఎమ్మెల్సీ, పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుద‌ల చేశారు.

+ ఏపీలో 13 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 8 స్థానిక సంస్థల నియోజకవర్గాలు, మూడు గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

+ నోటిఫికేష‌న్ జారీ ఈ నెల 16న‌. పోలింగ్ మార్చి 13న జర‌గ‌నుంది. ఎన్నికల ఫలితాలు అదే నెల 16న విడుద‌ల కానున్నాయి.

ఏపీలో టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలు ఇవీ..

1. ప్రకాశం - నెల్లూరు - చిత్తూరు జిల్లాలు

2. కడప - అనంతపురం - కర్నూలు జిల్లాలు

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలు

1. ప్రకాశం- నెల్లూరు -చిత్తూరు

2. కడప- అనంతపురం- కర్నూలు

3. శ్రీకాకుళం- విజయనగరం- విశాఖపట్నం


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.