Begin typing your search above and press return to search.
ఎలక్షన్ ట్రెండ్స్: ఐదు రాష్ట్రాలు, తిరుపతి, సాగర్ లో ఆధిక్యత వీరిదే
By: Tupaki Desk | 2 May 2021 3:45 AM GMTరెండు నెలలుగా సాగిన ఎన్నికల ప్రహసనానికి ఓటరు తీర్పు రాబోతోంది. ఈ ఉదయం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఆ తర్వాత సాధారణ ఓట్లను లెక్కిస్తున్నారు.
ఉదయం 9 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం.. ఈ కౌంటింగ్ ఫలితాలు ఇలా ఉన్నాయి..
-పశ్చిమ బెంగాల్ లో హోరాహోరీ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు యుద్ధాన్ని తలపించాయి. అధికార టీఎంసీ వర్సెస్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కొదమ సింహాల్లా తలపడ్డాయి.ఈ క్రమంలోనే ఓట్ల లెక్కింపులోనూ అదే ధోరణి కనిపిస్తోంది. బెంగాల్ లో మొత్తం 292 అసెంబ్లీ స్థానాల్లో టీఎంసీ 71, బీజేపీ 65 చోట్ల ఆధిక్యంలో ఉంది. లెఫ్ట్ పార్టీలు 3 చోట్ల ఆధిక్యంలో ఉన్నట్టు వార్తలు వెలువడ్డాయి.
-తమిళనాడులో డీఎంకే ముందంజ
ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించినట్టే డీఎంకే పార్టీ దూసుకుపోతోంది. తొలి రౌండ్ లో ఆధిక్యత చాటింది. డీఎంకే 20 స్థానాల్లో ఆధిక్యత కనబరచగా.. అధికార అన్నాడీఎంకే 16 స్తానాల్లో ముందంజలో ఉంది. ఇక ఏఎంఎంకే 2 స్థానాల్లో లీడ్ లో ఉంది.
-కేరళలలో హోరాహోరీ
కేరళ అసెంబ్లీ ఫలితాల్లో లెఫ్ట్ పార్టీ, కాంగ్రెస్ హోరాహోరీ తలపడుతున్నాయి. అధికార ఎల్డీఎఫ్ 27 స్థానాల్లో ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ కూటమి 26 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది.
-అసోంలో బీజేపీ లీడ్
ఇక బీజేపీ పవనాలు అస్సాం రాష్ట్రంలో వీస్తున్నాయి. బీబీపీ 23 స్థానాల్లో లీడ్ లో ఉండగా, కాంగ్రెస్ కూటమి 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఏజేపీ 2 స్థానాల్లో ముందంజలో ఉంది.
-పుదుచ్చేరిలోనూ హోరాహోరీ
పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగగా.. అన్నాడీఎంకే 6 చోట్ల, డీఎంకే 4 చోట్ల విజయం సాధించింది.
-తిరుపతిలో పోస్టల్ బ్యాలెట్ లో వైసీపీ ఆధిక్యం
తిరుపతి ఉప ఎన్నికల్లో మందకొడిగా కౌంటింగ్ సాగుతోంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. వైసీపీ ఆధిక్యంలో ఉంది.
-నాగార్జున సాగర్ లో రెండు రౌండ్లలో టీఆర్ఎస్ విజయం
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తొలి రౌండ్ లో టీఆర్ ఎస్ 1,475 ఓట్లతో ఆధిక్యంలో ఉంది. తొలి రౌండ్ లో టీఆర్ ఎస్ అభ్యర్థి నోముల భగవత్ కు 4, 228 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి 2,753 ఓట్లు పోలయ్యాయి. నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ప్రాంగణంలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. రెండు హాళ్లల్లో ఏడు టేబుళ్ల చొప్పున మొత్తం 14 టేబుళ్లపై లెక్కింపు ఏర్పాటు చేశారు. ఇక రెండో రౌండ్ లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ లీడ్ లో కొనసాగుతున్నారు.