Begin typing your search above and press return to search.
ఎలక్షన్ ట్రెండ్: తమిళనాడు డీఎంకేదే.. కేరళ లెఫ్ట్ కే.. బెంగాల్ టఫ్
By: Tupaki Desk | 2 May 2021 4:44 AM GMTఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. తమిళనాడులో మ్యాజిక్ మార్క్ దిశగా డీఎంకే సాగుతోంది. ఇక కేరళలో అధికార కమ్యూనిస్టు కూటమి దాదాపు అధికారం సాధించే సీట్లలో ఆధిక్యం సాధించింది. ఇక బెంగాల్ లో హోరా హోరీ నెలకొంది. స్వయంగా సీఎం మమత బెనర్జీ పోటీచేసిన నందిగ్రాంలో ఆమె వెనుకబడడం సంచలనమైంది. ఆమెపై బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి తొలి రౌండ్ లో ఆధిక్యంలోకి రావడం విశేషం.
-బెంగాల్ లో హోరా హోరీ
బెంగాల్ లో టీఎంసీ వర్సెస్ బీజేపీ హోరా హోరీ సాగుతోంది. మొత్తం 292 సీట్లలో టీఎంసీ 149 స్థానాల్లో లీడ్ లో ఉంది. బీజేపీ 119 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.. లెఫ్ట్ పార్టీల కూటమి 4 స్థానాల్లో, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
-ఇక తమిళనాడులో డీఎంకే హవా
తమిళనాడులో ప్రతిపక్ష డీఎంకే 125 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. అన్నాడీఎంకే 92 సీట్లలో లీడ్ లో ఉంది. బీజేపీ ఇక్కడ ఖాతా తెరవలేదు.
-కేరళ కమ్యూనిస్టులదే
కేరళలోని మొత్తం 140 సీట్లలో అధికార ఎల్డీఎఫ్ 78 సీట్లలో ఆధిక్యంలో ఉండి మేజిక్ మార్క్ అయిన 70 సీట్లు దాటేసింది. దీంతో ఎల్డీఎఫ్ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ 60 స్థానాల్లో బీజేపీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
-అసోంలో బీజేపీ హవా
అసోంలోని మొత్తం 126 సీట్లలో బీజేపీ కూటమి 59 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ప్రతిపక్ష యూపీఏ కూటమి 26 స్థానాల్లో లీడ్ లో ఉంది.
-పుదుచ్చేరిలో ఎన్డీఏ లీడ్
పుదుచ్చేరిలోని మొత్తం 30 సీట్లలో ఎన్డీఏ కూటమి 12 సీట్లలో ఆధిక్యంలో ఉంది. డీఎంకే కూటమి 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.