Begin typing your search above and press return to search.
బాల్ కొండలో టికెట్ వార్!
By: Tupaki Desk | 1 Sep 2018 4:59 PM GMT2019 ఎన్నికలు సమీపించడం....వీలుంటే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో తెలంగాణలో రాజకీయాలు క్రమక్రమంగా వేడెక్కుతున్నాయి. వరుసగా రెండో సారి అధికారం చేపట్టాలని టీఆర్ ఎస్.....ఎలాగైనా గులాబీ దండుకు చెక్ పెట్టాలని కాంగ్రెస్ లు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ఎత్తులు పైఎత్తులు వేస్తున్నాయి. అయితే, ఈ రెండు పార్టీలకు సొంత నేతల మధ్య టికెట్ వార్ కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. ఇటు టీఆర్ ఎస్..అటు కాంగ్రెస్...ల మధ్య పొలిటికల్ వార్ స్టార్ట్ కాకముందే ...ఆ పార్టీలలో ఇంటర్నల్ గా టికెట్ వార్ జరుగుతోంది. ప్రత్యర్థి పార్టీతో తలపడడానికి ముందే....సొంతపార్టీలో టికెట్ల వార్ కు చెక్ పెట్టాలని ఇరు పార్టీలు ప్లాన్ చేస్తున్నాయట.
ఎన్నికలకు వెళ్లే ముందుగా ఏ పార్టీ అయిన ప్రత్యర్థితో ఎలా తలపడాలి...అని వ్యూహ ప్రతి వ్యూహాలు సిద్ధం చేస్తుంది. అందుకు అవసరమైన అస్త్రశస్త్రాలను రెడీగా ఉంచుకుంటుంది. అయితే, తెలంగాణలోని బాల్ కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ - టీఆర్ ఎస్ పార్టీలలో జరుగుతోన్న టికెట్ వార్ మాత్రం ఆయా పార్టీలకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోందట. బాల్ కొండలో టీఆర్ ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే...వేముల ప్రశాంత్ రెడ్డిపై వ్యతిరేకత ఉందట. దీంతో, ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని సునీల్ రెడ్డి .....టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. ఒకవేళ గులాబీ బాస్ టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ గా పోటీకి రెడీ అయ్యారట. దీంతో, సునీల్....ప్రశాంత్ ల మధ్య టికెట్ వార్ నడుస్తోందట. మరోవైపు, కాంగ్రెస్ లో కూడా అనిల్ యాదవ్ , ఉమ్మడి ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి ల మధ్య టికెట్ వార్ నడుస్తోందట. బాల్ కొండ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సురేష్ రెడ్డి......2009,2014లో ఆర్మూర్ నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. దీంతో, ఈ సారి బాల్ కొండ నుంచి పోటీ చేయాలని గట్టిగా అనుకుంటున్నారట. దీంతో, ఆ రెండు పార్టీలలో ఎవరికి టికెట్ దక్కుతుందో..అన్న సంగతి కార్యకర్తలకూ తెలీదట.