Begin typing your search above and press return to search.

షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు

By:  Tupaki Desk   |   28 Dec 2021 5:33 AM GMT
షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు
X
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకారమే జరపాలని కేంద్ర ఎన్నికల కమిషన్ దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చింది. దేశంలో విస్తరిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల వాయిదా విషయాన్ని పరిశీలించమని అలహాబాద్ హైకోర్టు కమీషన్ కు సూచించిన విషయం తెలిసిందే. ఇదే విషయమై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆధ్వర్యంలో ఎన్నికల కమీషనర్లు సమీక్ష జరిపారు.

రాష్ట్ర అసెంబ్లీ షెడ్యూల్ కాలపరిమితి ముగింపుకు వచ్చేసింది కాబట్టి ఇపుడు ఎన్నికల వాయిదా సాధ్యం కాదన్నట్లుగా అభిప్రాయపడ్డారు. అయితే ఎన్నికలకు ముందే కోవిడ్ టీకాల వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మాత్రం స్పీడు చేయాలని కమీషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒమిక్రాన్ తీవ్రత కారణంగా యూపీలో ఎన్నికలు వాయిదా వేస్తే మిగిలిన మణిపూర్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ లో కూడా వాయిదా వేయాల్సొస్తుందని కమీషన్ అభిప్రాయపడింది.

ఎన్నికలను వాయిదా వేయటం కన్నా అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకుని ఎన్నికలకు వెళ్ళటమే మేలని ఫైనల్ చేశారు. అందుకనే ఐదు రాష్ట్రాల వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో పాటు డీజీపీలు+కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో కమిషన్ చర్చలు జరుపుతోంది. పై రాష్ట్రాల్లో అవసరానికి మించి పోలీసు, భద్రతా దళాలను రంగంలోకి దింపి కోవిడ్ టీకాల కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ అనుకుంటోంది.

ఒకపుడు పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికలతో పాటు కుంభమేళా నిర్వహణ సమయంలో ఆయా ప్రభుత్వాలు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండానే నిర్వహించేశాయి. దాంతో కరోనా వైరస్ సెకండ్ వేవ్ దేశాన్ని వణికించేసింది. మళ్ళీ అలాంటి పరిస్ధితి దేశానికి రాకూడదనే అలహాబాద్ హైకోర్టు ఎన్నికల కమీషన్ను సూచించింది. కానీ కమిషన్ ఏమో ముందు జాగ్రత్తలు తీసుకుని ఎన్నికలను నిర్వహించాలని అభిప్రాయపడింది. మరి ఎన్నికలు అయ్యేనాటికి పరిస్దితుల్లో ఏమి మార్పు వస్తుందో చూడాల్సిందే.