Begin typing your search above and press return to search.
ఇరవై రోజులు....రోజుకు కోటి !
By: Tupaki Desk | 19 Nov 2018 6:16 AM GMTఇరవై రోజులు. ఎప్పుడో చిరంజీవి నటించిన 47 రోజులు సినిమా అనుకుంటున్నారా.? ఇదీ ఒక రకంగా సినిమాయే కానీ..వెండితెరపై కాదు తెలంగాణ సమాజ తెరపై ప్రదర్శించే సినిమా. అదే తెలంగాణ ముందస్తు ఎన్నికలకు గడువు. వెండితెర సినిమా నిర్మించాలంటే కోట్లు ఖర్చు చేయాల్సిందే. సినిమా ఆడినా - ఆడకపోయినా కోట్లు ఖర్చు మాత్రం ఖాయం. తెలంగాణ ముందస్తు ఎన్నికల సినిమా కూడా బ్రూ కాఫీలా ఇంచుమించు సరిసాటి. ఇక్కడ కూడా విజయం వరించిన - ఓటమి పాలైన ఖర్చు మాత్రం కామన్.
తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్దులు రెండు నెలలుగా ప్రచారంలో ఉన్నా పెద్దగా ఖర్చు చేస్తున్నట్లు కనిపించడం లేదు. ఇప్పుడు వారి ప్రత్యర్దులు ఎవరో తేలిపోవడంతో ఇక ఖర్చులు భారీగా చేయాల్సిందే. ఇది కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్దులకే కాదు. ఎన్నికల బరిలో నిలిచిన మొత్తం అన్ని పార్టీల అభ్యర్దులకు వర్తిస్తుంది. బహిరంగ సభలు - సమావేశాలు - ఇంటింటి ప్రచారం పత్రిక గోష్టులు - కుల సంఘాలతో సమావేశాలు - విద్యార్ది నాయకులతో భేటీలు - డ్వాక్రా మహిళలతో మంతనాలు - కాలనీ వాసులతో కలసి పోవడాలు - ఇలా ప్రతీ ఒక్క అంశాన్ని పూర్తి చేసేందుకు ఇక మిగిలినవి 20 రోజులే.
ఓటర్లును తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్దులు అన్ని ప్రయాత్నాలు చేయాలి. డబ్బు వెదజల్లాలి. కొందరిని బతిమాలాలి. మరికొందరిని బెదిరించాలి. ఇంకొందరికి డబ్బులు ఎరగా వేయాలి. గ్రామాలకు అది చేస్తాం..ఇది చేస్తాం అంటూ వాగ్దానాలు చేయాలి. వీటన్నింటికి భారీగా డబ్బులు వెదజల్లాలి. పగటిపూట జరిగే ఈ పనులకు కొంత ఖర్చు చేస్తే, రాత్రి పూట జరిగే విందూ వినోదాలు - మందు మజాలు - రహస్య పార్టీలకు మరికొంత వెచ్చించాలి. సగటన రోజుకు కోటి రూపాయలు ఖర్చు చేసిన రానున్న 20 రోజులలో ఒక్కో అభ్యర్ది 20 కోట్ల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్దితి. అన్నట్లు ప్రత్యర్దుల ఎత్తులకు పై ఎత్తులు వేయాలంటే మరికొంత ఖర్చు చేయాలి. ఇలా ఈ 20 రోజుల పాటు ముందస్తు ఎన్నికలలో డబ్బు దావానలంలా ఖర్చు అవుతూనే ఉంటుంది. సమయం ఉంది మిత్రమా ఖర్చు చేేసేద్దాం... విజయం సాధిద్దాం.