Begin typing your search above and press return to search.

ఏపీలో ఎన్నికల నగారాకు ముహుర్తం ఖరారు

By:  Tupaki Desk   |   19 Jan 2019 8:32 AM GMT
ఏపీలో ఎన్నికల నగారాకు ముహుర్తం ఖరారు
X
ఏపీలో ఎన్నికల కోలాహలం మొదలైంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక ఏపీలో జరిగే ఎన్నికల పైనే అందరి దృష్టి కేంద్రీకరించబడింది. ఇక దాదాపు ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మూహుర్తం ఖరారైంది. ఫిబ్రవరి మొదటి వారంలో లేదా మార్చి మొదటి వారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడులయ్యే అవకాశం ఉంది. దీంతో ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ పూర్తిగా ఎన్నికల వ్యవహారాల పైనే దృష్టి సారించాయి.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్ సభకు ఎన్నికలు జరగాల్సి ఉంది. లోక్ సభ ఎన్నికలను ఏపీతోపాటు ఒడిశా - సిక్కిం - అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల కూడా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. ఈశాన్య రాష్ట్రాలకు భద్రతా సిబ్బంది ఎక్కువగా వినియోగించాల్సి ఉండటంతో ఏపీలో తొలి విడుతలో ఎన్నికలు ముగించనున్నారు. తద్వారా ఇక్కడి బలగాలను ఆ ప్రాంతాలకు తరలించే వీలుంటుందని ఎన్నికల కమిషన్ భావిస్తోంది.

ఏపీ అసెంబ్లీకి జూన్ 18న గడువు ముగియనుంది. రాష్ట్ర విభజన కారణంగా 2014లో తెలంగాణలో ఏప్రిల్ 30 - ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 7న ఎన్నికలు జరిగాయి. మే 16న ఎన్నికల ఫలితాలు వెల్లడయిన సంగతి తెల్సిందే.

ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలతోపాటు 25 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ మేరకు మార్చి తొలి వారంలోనే ఎన్నికలు విడుదల కానుందని విశ్వసనీయ సమాచారం. దీంతో ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల కార్యాచరణను సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ఈనెల 21న క్యాబినేట్ సమావేశం నిర్వహంచి పలు కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోనుంది. 30న ఓట్ ఆన్ బడ్జెట్ సమావేశాలు - ఫిబ్రవరి 5న ఓట్ ఆన్ బడ్జెట్ పై కీలక ప్రకటనలు ఉండే అవకాశం ఉందని సమాచారం.

టీడీపీ ప్రభుత్వంతోపాటు ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల వరాలకు సిద్ధమవుతున్నారు. తమతమ మేనిఫెస్టోలను ఇప్పటికే జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ నేతలు తమ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతుందని ప్రచారం చేస్తోంది. అంతేకాకుండా నియోజకవర్గాల వారీగా వైసీపీ హామీలకు సమాయత్తం అవుతోంది. ఇక జనసేన పార్టీ కూడా నియోజవర్గాల వారీగా అభ్యర్థుల కోసం కసరత్తు ప్రారంభించింది. నేటి నుంచి ప్రతీ రోజు కీలకం కావడంతో ఈ చలిలోనూ ఏపీలో వేడి తలపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ఖరారు కావడంతో ఇక జంపింగ్ కోలహాలం మొదలుకావడం ఖాయంగా కనిపిస్తోంది.