Begin typing your search above and press return to search.

13 రాజ్యసభ స్థానాలకు మార్చి 31న ఎన్నికలు

By:  Tupaki Desk   |   7 March 2022 2:51 PM GMT
13 రాజ్యసభ స్థానాలకు మార్చి 31న ఎన్నికలు
X
దేశంలో మరో ఎన్నికల నగరా మోగింది. అయితే ఈసారి ప్రత్యక్ష ఎన్నికలు కావు.. పరోక్ష ఎన్నికలు.. ఈనెలాఖరుతో ఖాళీ కానున్న రాజ్యసభ సీట్లను భర్తీ చేయనున్నారు. దేశంలోని 6 రాష్ట్రాలకు చెందిన 13 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈనెల 31వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటించింది.

అసోం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, నాగాలాండ్, త్రిపుర నుంచి రాజ్యసభ సభ్యులు ఏప్రిల్ 2న రిటైర్ కానుండగా.. పంజాబ్ నుంచి ఐదుగురు సభ్యులు ఏప్రిల్ 9న రిటైర్ కానున్నారు. రిటైర్ కానున్న వారిలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఏకీ ఆంటోనీ, ఆనంద్ శర్మ ఉన్నారు.

పంజాబ్ నుంచి ఖాళీ కానున్న ఐదు సీట్లలో మూడు సీట్లు ఒక ఎన్నికల్లో.. మరో రెండు సీట్లు మరో ఎన్నికలో పూర్తి చేయనున్నట్టు ఈసీ తెలిపింది.

ఇక రాజ్యసభ సీట్ల కోసం మార్చి 14న నోటిఫికేషన్ జారీ చేస్తామని.. 31న ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ తెలిపింది. యథాప్రకారం ఓటింగ్ జరిగిన రోజే సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుందని ఈసీ తెలిపింది.

పదవీకాలం ముగుస్తున్న రాజ్యసభ సభ్యులలో ఏకే అంటోనీ (కేరళ), ఆనంద్ శర్మ (హిమాచల్ ప్రదేశ్), ప్రతాప్ సింగ్ బజ్వా, నరేశ్ గుజ్రాల్ (పంజాబ్) వంటి ప్రముఖులు ఉన్నారు. రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే అంటోనీ, రాజ్యసభలో కాంగ్రెస్ డిప్యూటీ మంత్రి ఆనంద్ శర్మ, బజ్వాలు కాంగ్రెస్ కు చెందిన వారు కాగా.. గుజ్రాల్, శిరోమణి అకాలీదళ్ కు చెందిన వారు..

పంజాబ్ నుంచి 5 సీట్లు ఖాళీ అవుతుండగా.. కేరళలో 3, అసోంలో 2,హిమాచల్ ప్రదేశ్ , నాగాలాండ్, త్రిపురల నుంచి ఒక్కో సీటు ఖాళీ కానుంది.