Begin typing your search above and press return to search.

నేడు ఐదు రాష్ట్రాలు - 475 అసెంబ్లీ స్తానాలకు ఎన్నికలు

By:  Tupaki Desk   |   6 April 2021 4:11 AM GMT
నేడు ఐదు రాష్ట్రాలు - 475 అసెంబ్లీ స్తానాలకు ఎన్నికలు
X
దేశంలో అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఈరోజు జరుగుతున్నాయి. ఈ మినీ సంగ్రామంలో గెలుపు ఎవరిదన్నది ఉత్కంఠగా మారింది. ఓటర్లు ఎవరికి పట్టం కడుతారన్నది ఆసక్తిగా మారింది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి లకు ఒకే విడతలో ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక అసోంలోనూ చివరిదైన మూడో విడతతో ఈరోజు ఎన్నికలు పూర్తి కాబోతున్నాయి.

ఇక పశ్చిమ బెంగాల్ లో మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తంగా ఇవాళ ఒక్కరోజే 475 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇందులో తమిళనాడులో 234 అసెంబ్లీ నియోజకవర్గాలు, కేరళలో 140, అసోంలో 30, పశ్చిమ బెంగాల్ లో 31, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటితోపాటు మలప్పురం, కన్యాకుమారి లోక్ సభ స్థానాలకు కూడా మంగళవారం పోలింగ్ జరుగనుంది.

పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు భారీగా భద్రతా బలగాలను మోహరించింది. కోవిడ్-19 పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఓటర్లు సురక్షితంగా ఓటు వేసేలా ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.

తమిళనాడులో మొత్తం 6.28 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగున్నాయి.

కేరళలో మొత్తం 2.74 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 140 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 957 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు.

పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అసోంలో ఈరోజు చివరి విడతలో 40 స్తానాలకు పోలింగ్ జరుగనుంది. ఈ స్థానాల్లో మొత్తం 337 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు.

పశ్చిమ బెంగాల్ లో మూడో విడతలో 31 స్తానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 205 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు.