Begin typing your search above and press return to search.
రెండు రాష్ట్రాల్లోనూ ఒకేసారి ఎన్నికలు!
By: Tupaki Desk | 24 Feb 2019 3:25 PM ISTదేశవ్యాప్తంగా జరుగనున్న లోక్ సభ ఎన్నికల తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజున జరగనున్నాయి. ఈ మేరకు భారత ఎన్నికల కమిషన్ సూత్రప్రాయంగా అంగీకరించింది. లోక్ సభ ఎన్నికలను తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ ఒకేరోజు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ ను కలిసి విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న భారత ఎన్నికల కమిషన్ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకే రోజున లోక్ సభకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన అనేకమంది తెలంగాణలో పలు ఉద్యోగాలు, వ్యాపారాల్లో స్థిరపడ్డారు. వారంతా అటు ఆంధ్రప్రదేశ్ లోనూ, ఇటు తెలంగాణలోనూ కూడా తమ పేర్లను ఓటర్ జాబితాలో నమోదు చేయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక రోజు, తెలంగాణలో మరో రోజు ఎన్నికలు జరగడం వల్ల తెలంగాణలో ఓట్లుగా నమోదు చేసుకున్న వారంతా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా పాల్గొంటారని ఇది రాజ్యాంగ విరుద్ధమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భారత ఎన్నికల కమిషన్ కుసూచించింది.
ఈ విజ్ఞప్తిని అనుసరించి రానున్న జనరల్ ఎన్నికలను ఆంధ్రప్రదేశ్ లో ఒక రోజు, తెలంగాణలో మరో రోజు నిర్వహించకుండా రెండు రాష్ట్రాల్లో ఒకేసారి నిర్వహించాలని భారత ఎన్నికల కమిషన్ నిర్ణయించింది . మరోవైపు ఎన్నికల నిర్వహణ ఖర్చు కూడా కలిసి వస్తుందని ఎన్నికల కమిషన్ భావిస్తోంది. రెండు రాష్ట్రాల్లో విడివిడిగా ఎన్నికలు నిర్వహించడం వల్ల ఖర్చు తడిసి మోపెడు అవుతుంది అని ఇరు రాష్ట్రాలకు చెందిన ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారులు భారత ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. ఎన్నికల ఖర్చు, సిబ్బంది, భద్రత, బ్యాలెట్ బాక్సుల పరిరక్షణ, పోలీసులు విధి నిర్వహణ వంటి కీలక అంశాలను పరిగణలోకి తీసుకున్న భారత ఎన్నికల కమిషన్ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఒకరోజున లోక్ సభ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. దీనివల్ల డబుల్ ఓటింగ్ సమస్యను పరిష్కరించడంతో పాటు అదనపు వ్యయం, ఇతర అంశాలను కూడా తమ పరిధిలో ఉంచుకోవచ్చు అని ఎన్నికల కమిషన్ భావిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ను ఒకేసారి ఎన్నికలు జరగాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన విజ్ఞప్తిని భారత ఎన్నికల కమిషన్ గౌరవించడం ఆ పార్టీ శ్రేణులకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.