Begin typing your search above and press return to search.

ఎన్నికలు, సినిమాలకు ఓకే.. పరీక్షలకు పవన్ నాట్ ఓకే

By:  Tupaki Desk   |   21 April 2021 6:30 AM GMT
ఎన్నికలు, సినిమాలకు ఓకే.. పరీక్షలకు పవన్ నాట్ ఓకే
X
జనసేనాని పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. ఇటీవల ఆయన సినిమా వకీల్ సాబ్ రిలీజ్ వేళ హైకోర్టు ఆదేశానుసారం బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపును ఏపీ సర్కార్ నిలిపివేసింది. దీంతో పవన్ ను టార్గెట్ చేశారని జనసేన నేతలు,బీజేపీ నేతలు పెద్ద ఎత్తున జగన్ సర్కార్ పై ఎదురుదాడి చేశారు. జగన్ కావాలనే పవన్ పై ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఆరోపించారు.

ఇక కరోనా కల్లోలం వేళ సైతి పవన్ తిరుపతిలో ర్యాలీలు, సభలు నిర్వహించారు. అదే సీఎం జగన్ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సభను ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు.. సెకండ్ వేవ్ వేళ ఇలాంటివి పెట్టకూడదని పవన్ కు తెలిసినా ఆయన ఆగలేదు. స్వయంగా కరోనా బారినపడ్డాడు. తిరుపతి ఎన్నిక రద్దు గురించి మాట్లాడలేదు.

అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు పకడ్బందీ ప్లాన్ తో పరీక్షల నిర్వహణకు నడుం బిగించింది. కరోనా నిబంధనలతో ఏర్పాట్లు చేసింది. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ను నిర్ధేశించే ఈ వ్యవహారం విద్యార్థులకు కీలకం. తక్కువ స్థాయి, ఎక్కువ స్థాయి చదివే వారు మెరిట్ విద్యార్థులు నష్టపోకుండా పరీక్షలు అత్యవసరం. అందరూ పాస్ అయితే ర్యాంకులు, గ్రేడుల్లో విద్యార్థులకు తీవ్ర నష్టం. వారి భవిష్యత్ ఉద్యోగాలపై దీని ప్రభావం పడుతుంది. అందుకే పరీక్షలు విద్యార్థులకు అత్యవసరం.

అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఏపీలో పరీక్షలు నిలిపివేయాలని’ డిమాండ్ చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వకీల్ సాబ్ మూవీ థియేటర్లలో మాస్కులు లేకుండా తిరుగుతున్నారని.. థియేటర్లలో ఎక్కువగా వైరస్ బారినపడుతారని.. వాటిని మూసివేయకుండా విద్యార్థుల భవిష్యత్ ను నిర్ణయించే పరీక్షలను రద్దు చేయాలనడం ఏంటని పవన్ ను నిలదీస్తున్నారు. ముందు అంతగా ప్రేముంటే వకీల్ సాబ్ సినిమాను థియేటర్లలో ఆపేసి ఆ తర్వాత పరీక్షల గురించి మాట్లాడాలని కౌంటర్ ఇస్తున్నారు.