Begin typing your search above and press return to search.

73 ఏళ్ల తర్వాత ఆ మూడు గ్రామాల్లో విద్యుత్ కాంతులు !

By:  Tupaki Desk   |   2 Aug 2020 1:30 AM GMT
73 ఏళ్ల తర్వాత ఆ మూడు గ్రామాల్లో విద్యుత్ కాంతులు !
X
స్వాతంత్రం తర్వాత , దాదాపుగా 73 ఏళ్లుగా వెలుతురుకి దూరమైనా ఉత్తర కశ్మీర్‌ కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న మూడు గ్రామాల్లో త్వరలో విద్యుత్ కాంతులు వెలగబోతున్నాయి. నిరంతం పాక్ దాడుల, దానితోపాటుగా భారీ మంచు కారణంగా ఆరు నెలలు పాటు దాదాపు బయట ప్రపంచంతో ఈ గ్రామాలకు సంబంధాలు తెగిపోతాయి. ఈ మూడు గ్రామాల్లో మొత్తం 14వేల మంది నివసిస్తున్నారు. ఈ ప్రాంతం లో కరెంట్ సౌకర్యాన్ని కల్పించడానికి కశ్మీర్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ రెండేళ్ల గడువు నిర్దేశించుకుంది. కేరన్, ముండియన్, పట్రారు గ్రామాలకు విద్యుత్తు సరఫరాకు 33 కేవీ లైన్, సబ్-స్టేషన్‌ ఏర్పాటు ప్రక్రియ గతవారం ముగిసింది.

నియంత్రణ రేఖకు కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్న కేరన్‌కు విద్యుత్తు సరఫరా కోసం ఈ ప్రాజెక్టు కింద 979 స్తంభాలు ఏర్పాటు చేశారు. కరెంట్ పనులు వేగంగా జరగడానికి కరోనా లాక్‌ డౌన్ సహకరించిందని కేపీడీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ మొహమూద్ అజీజ్ అసద్ తెలిపారు. ఈ లాక్‌ డౌన్ వల్ల సాధారణ కార్యకలాపాలు నిలిచిపోవడతో ఈ ప్రాజెక్టు పనులకు వర్కర్లు కొరతలేకుండా వేగంగా పూర్తయ్యిందన్నారు. నియంత్రణ రేఖకు సమీపంలో ఉణ్న సున్నితమైన ప్రాంతం కావడంతో హై టెన్షన్ వైర్లు, స్తంభాలు వేయడానికి తమ బృందానికి సవాల్ ‌గా మారింది అని తెలిపారు.

ఆ ప్రాంతం మొత్తం రక్షణ విభాగానికి చెందిన భూమి కావడంతో కొంచెం ఎక్కువ సమయం పట్టిందని, ఉన్నతస్థాయి నుంచి ఆమోదాలకి వేచి చూడాల్సి వచ్చింది అని ఓ అధికారి తెలిపారు. గ్రామాల్లోని గృహాలు సౌర విద్యుత్తుపై ఆధారపడి ఉన్నాయి. అవి లేకపోతే, సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్య జనరేటర్ల ద్వారా విద్యుత్ సరఫరా అందిస్తున్నాం అని అయన తెలిపారు. ఇక ఎక్కడ ద్యుత్ ఖర్చు యూనిట్‌కు 2-3 రూపాయల మధ్య ఉంటుంది.