Begin typing your search above and press return to search.
ట్రెండ్ సెట్ చేద్దామంటున్న మోడీ సర్కారు
By: Tupaki Desk | 26 March 2016 6:23 AM GMTఅప్పుడెప్పుడో పవన్ కల్యాణ్ తన సినిమాలో చెప్పిన డైలాగ్ లాంటిదే తాజాగా కేంద్రమంత్రి నోటి నుంచి రావటం ఆసక్తికరం. ఎంతసేపటికి ట్రెండ్ ను ఫాలో కావటమేంటి? మనమే ట్రెండ్ సెట్ చేసేస్తే పోలా అంటూ కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించటం గమనార్హం. ఇంతకీ కేంద్రమంత్రి నోటి వెంట పవన్ డైలాగ్ రావటం వెనుక అసలు కారణం తెలిస్తే.. మరింత ఎక్సైట్ మెంట్ కలగటం ఖాయం.
సంప్రదాయ ఇంధనాల్ని వినియోగిస్తూ.. విపరీతమైన కాలుష్యానికి గురి చేస్తున్న నేపథ్యంలో.. అందుకు భిన్నమైన ధోరణిని అనుసరిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కొద్దికాలంగా కేంద్ర విద్యుత్ శాఖ చేస్తోంది. ఇందులో భాగంగా విద్యుత్ ను ఆదా చేసేందుకు ఎల్ ఈడీ బల్బుల్ని దేశ వ్యాప్తంగా పంపిణీ చేయటం తెలిసిందే. ఈ పని ఒక పక్కన జరుగుతూనే.. మరోవైపు తక్కువ విద్యుత్ తో నడిచే ఫ్యాన్లు.. ఏసీలను పంపిణీ చేయటం మొదలు పెట్టింది. తాజాగా.. ఎవరూ ఊహించని ఒక కొత్త ప్లాన్ ను కేంద్రమంత్రి గోయల్ నోటి నుంచి వచ్చింది.
మరో 14 సంవత్సరాల్లో భారతదేశం మొత్తం ఎలక్ట్రికల్ మీద నడిచే కార్లు వాడే దేశంగా మారితే ఎలా ఉంటుందన్న మాటను చెప్పి.. అదేమీ పెద్ద కష్టం కాదని.. సరిగా ఆలోచిస్తే ఆచరణ సాధ్యంగా చెప్పుకొచ్చారు. దేశ వ్యాప్తంగా విద్యుత్ తో నడిచే కార్లను వినియోగించటం కానీ మొదలు పెడితే.. కాలుష్యం అన్న మాటే ఉండదని.. ఇది దేశం రూపు రేఖలు మార్చటమే కాదు.. ప్రపంచంలోనే పూర్తిగా విద్యుత్ కార్లు వినియోగించే దేశంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే.. విద్యుత్ కార్ల కోసం ప్రజల మీద ఎలాంటి భారం లేకుండా చేయటం కోసం.. ఎలక్ట్రిక్ కారును ఎలాంటి డౌన్ లోడ్ లేకుండా ఇవ్వటం.. కారు కొన్నాక ప్రతి నెలా ఇంధనం కోసం పెట్టే ఖర్చును కారు ఈఎంఐగా ఇస్తే సరిపోతుంది కదా అన్న ఐడియాను ఆవిష్కరించారు. ప్రజల నుంచి రూపాయి వసూలు చేయకుండా ప్రజలకు ఎలక్ట్రిక్ కార్లను అందించే పని చేస్తే ఇంధన ఖర్చులు ఉండవని.. భారీగా డబ్బు మిగులుతుందన్న మాటను చెప్పిన ఆయన.. ఇలాంటి వాటిని సాధించేందుకు కొంత కష్టపడాలని.. మెదడు పెట్టి ఆలోచిస్తే ఆచరణ సాధ్యమేనని తేల్చారు. నిత్యం ప్రాశ్చాత్య దేశాల ట్రెండ్ ఫాలో అయ్యే కన్నా.. మనమే క్రియేట్ చేస్తే బాగుంటుంది కదా అన్న ఆయన.. ఇలాంటివి స్మార్ట్ గా పని చేస్తే సాధ్యమవుతాయని చెప్పుకొచ్చారు. పవర్ స్టార్ డైలాగ్ ను చెప్పిన కేంద్రమంత్రి ఐడియా కూడా అదిరిపోయింది కదూ..?