Begin typing your search above and press return to search.

ఎలెన్ మస్క్ తండ్రి రెండో భార్య కూతురితో అక్రమ సంబంధం..

By:  Tupaki Desk   |   15 July 2022 11:44 AM GMT
ఎలెన్ మస్క్ తండ్రి రెండో భార్య కూతురితో అక్రమ సంబంధం..
X
ప్రపంచ కుభేరుడు ఎలెన్ మస్క్ గురించి చాలా మందికి తెలిసిపోయింది. సోషల్ మీడియాను వాడే ప్రతి ఒక్కరికి ఆయన ఆస్తులలు, కార్ల కంపెనీ గురించి పరిచయం అయింది. అయితే ఇప్పుడు ఆయన తండ్రి పేరు మారుమోగుతోంది. ఎలెన్ మస్క్ తండ్రి ఎర్రల్ మస్క్. ఎలెన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలును రద్దు చేసుకున్న నేపథ్యంలో ఆ సంస్థ ప్రతినిధులు కోర్టుకెక్కారు. ఇందులో భాగంగా ఆయన తండ్రి గురించి ప్రస్తావన వచ్చింది. ఎర్రల్ మస్క్.. తన రెండో భార్య కూతురితో అక్రమ సంబంధం పెట్టుకున్నానని, ఆమెతో ఇద్దరు పిల్లలను కూడా కన్నాడని సంచలన విషయాన్ని బయటపెట్టాడు. అంతేకాకుండా పుట్టింది అనుభవించానికేనని చెప్పడం వివాదాస్పదంగా మారింది.

ఎలెన్ మస్క్ తండ్రి ఎర్రల్ మస్క్ కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరు మాయె హెల్డెమాన్ మస్క్. ఆమె కుమారుడే ఎలెన్ మస్క్. ఈయనతో పాటు టోస్కా, కింబర్ అనే మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కొన్ని కారణాల వల్ల ఈమెతోని 1979లోనే ఎర్రల్ మస్క్ విడాకులు తీసుకున్నాడు. ఆ తరువాత హీడో బెజూడెన్హాట్ ను రెండో పెళ్లి చేసుకున్నాడు. హీడోకు ఇది రెండో వివాహమే. అప్పటికే ఆమెకు జెనా అనే కూతురు ఉంది. నెనా నాలుగేళ్ల వయసు ఉండగా ఎర్రల్ మస్క్, హీడో పెళ్లి చేసుకున్నారు. అయితే జెనా పెద్దయ్యాక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు ఎర్రల్ మస్క్ సంచలన విషయాన్ని బయటపెట్టాడు.

'ది సన్' అనే మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో ఎర్రల్ మస్క్ ఈ విషయాన్ని బయటపెట్టాడు. అయితే మనిషి జన్మ ఉన్నది అనుభవించడానికేనని ఆయన చెప్పడం సంచలనంగా మారింది.

అంతేకాకుండా జెనాతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఆమెతో ఇద్దరు పిల్లలను కన్నాడు. 2019లో తనకు, జెనాకు ఆడబిడ్డ జన్మించిందని.. ఎలాన్ మస్క్ కు చెల్లెలు అవుతుందని అన్నారు. తనకు జెనాకు ప్రత్యేక అనుబంధం ఉందని, అది రాను రాను శారీరక సంబంధానికి దారి తీసిందని అన్నారు. ఈ పరిణామాలు ఎలెన్ మస్క్ కు ఇబ్బంది కాకూడదనే అసలు విషయాన్ని బయటపెట్టానన్నారు.

ఇక ఎలెన్ మస్క్ కు అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ట్విట్టర్ ను చేజిక్కించుకోవాలనుకుంటున్న ఆయన ఆశలు అడియాశలే అవుతున్నాయి. 44 బిలియన్ డాలర్ల విలువ చేసే ట్విట్టర్ ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకొని ఆ తరువాత అర్ధాంతరంగా రద్దు చేయడంపై ట్విట్టర్ యాజమాన్యం కోర్టుకెక్కింది. ఈ తరుణంలో ఎలెన్ మస్క్ తండ్రి ఎర్రల్ మస్క్ మరో సంచలన విషయాన్ని బయటపెట్టి ఎలెన్ మస్క్ ను ఇరుకున పెట్టాడు.