Begin typing your search above and press return to search.
చైనా వాడు ఇంకో అద్భుతం చేశాడు
By: Tupaki Desk | 23 May 2016 9:46 AM GMTపొట్టివాళ్లు గట్టివాళ్లు అంటుంటారు. చైనా వాళ్లను చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు మనకు అద్భుతంగా అనిపించే ఎన్నో సాంకేతిక నైపుణ్యాల్ని చైనావాళ్లు కొన్ని దశాబ్దాల కిందటే చూసేశారు. ఇప్పుడు అక్కడ అందుబాటులో ఉన్న సౌకర్యాలు.. సాంకేతికత.. మనం ఇంకో 20 ఏళ్లకైనా అందుకుంటామో లేదో చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా రవాణా వ్యవస్థ విషయంలో చైనా ప్రపంచం మొత్తానికి ఆదర్శంగా నిలుస్తోంది. జనాభాకు తగ్గట్లుగా అక్కడ అందుబాటులోకి వస్తున్న సరికొత్త ప్రయాణ సౌకర్యాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
మన దగ్గర ఇంకో 20 ఏళ్లకైనా ఓ బుల్లెట్ ట్రైన్ వస్తుందో లేదో కానీ.. చైనాలో ఆల్రెడీ అలాంటి ట్రైన్లు తిరిగేస్తున్నాయి. తాజాగా బస్సు రవాణాలో సైతం విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి చైనాలో. రోడ్డుకు మధ్యలో వేసిన పిల్లర్ల సాయంతో పైనుంచి మెట్రో ట్రైన్లు మన దగ్గర ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తుండగా.. పిల్లర్ల సాయం లేకుండా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ట్రాక్ సాయంతో నడిచే భారీ బస్సుల టెక్నాలజీని చైనాలో ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నారు. ఈ టెక్నలజీని ట్రాన్సిట్ ఎలివేటెడ్ బస్ (టీఈబీ) అంటున్నారు. దీన్ని సొంత టెక్నాలజీతో చైనా ఇంజినీర్లు రూపొందించారు.
రోడ్డు పై ఉన్న వాహనాల రాక పోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా ఈ ఎలివేటెడ్ బస్ ప్రయాణిస్తుంది. 19 వ చైనా బీజింగ్ అంతర్జాతీయ హైటెక్-ఎక్స్ పోలో దీని బ్లూ ప్రింట్ ప్రదర్శించారు. టీఈబీలో ప్రయాణికుల కోసం పై భాగంలో ప్రత్యేకంగా ఓ కంపార్ట్ మెంట్ ఉంటుంది. కింది భాగాన రోడ్డుపై వేరే వాహనాలు ఏ అడ్డంకీ లేకుండా వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎలివేటెడ్ బస్సులో ఒకేసారి 1200 మంది ప్రయాణించడానికి వీలుంటుంది. మెట్రో రైల్లో మాదిరే అన్ని సదుపాయాలూ ఉంటాయి. మెట్రో నిర్మాణానికి అయ్యే ఖర్చులో కేవలం ఐదోవంతు ఖర్చుతో ఈ ఎలివేటెడ్ బస్సుల్ని అందుబాటులోకి తేవచ్చు. పని కూడా వేగంగా పూర్తయిపోతుందట. క్విన్ హువాంగడో సిటీలో 2016 చివరికల్లా ఎలివేటెడ్ బస్ ట్రయల్ రన్ కూడా వేయబోతున్నారట.