Begin typing your search above and press return to search.
బాబు ముందే బీజేపీ, టీడీపీ గలాటా
By: Tupaki Desk | 5 March 2016 6:57 AM GMTతెలుగుదేశం - బీజేపీల మధ్య ఉన్న అప్రకటిత శత్రుత్వం సందర్భానుసారం బయటపడుతోంది. ఇన్నాళ్లు ఈ గ్యాప్ ద్వితీయ శ్రేణి నాయకుల్లో అసంతృప్తికే పరిమితం కాగా ఇపుడు ఏకంగా టీడీపీ అధినేత - ఏపీముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి దగ్గర ఫిర్యాదు చేసేవరకు వెళ్లింది.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపాల్టీలోని ముగ్గురు వైసీపీ కౌన్సిలర్లు విజయవాడలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి వచ్చిన తాడేపల్లిగూడెం టీడీపీ కార్యకర్తలు జిల్లాకు చెందిన బీజేపీ మంత్రి మాణిక్యాలరావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి తమను చాలా ఇబ్బందులు పెడుతున్నారని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ తాడేపల్లి గూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని అనుచరుడు శ్రీనివాసరావు చంద్రబాబు ముందే ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి ఒంటెద్దు పోకడలతో టీడీపీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి ఎలాంటి బలమూ లేకపోయినా పొత్తు ఉందనే గౌరవంతో మాణిక్యాల రావును గెలిపించామని ఆయన వివరించారు.
బీజేపీని గెలిపిస్తే ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని తనపై కూడా కేసులు పెట్టారని దీంతో ఇప్పటికీ కోర్టుకు తిరుగుతున్నామని మాజీ ఎమ్మెల్యే - టీడీపీ నేత ఈలి నాని కూడా ఈ సందర్భంగా చంద్రబాబుకు వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తనదైన శైలిలో స్పందించారు. టీడీపీ-బీజేపీ మధ్య అక్కడక్కడ ఇబ్బందులున్నాయన్నారు. రెండు పార్టీలు కలిస్తే చిన్న చిన్న విభేదాలు వస్తుంటాయని సముదాయించారు. ఎవరికీ ఇబ్బందులు లేకుండా కార్యకర్తలకు అండగా ఉంటానని చెబుతూనే ఏవైనా సమస్యలుంటే కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచించారు.
నియోజకవర్గాల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న బీజేపీ-టీడీపీ విబేధాలు ఇప్పుడు అధిష్టానానికి ఫిర్యాదు చేసేదాకా వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కేంద్ర బడ్జెట్ లో బీజేపీ సర్కారు ఏపీకి అన్యాయం చేసిందనే భావనలో ఉన్న తెలుగుతమ్ముళ్లు తమకు ఎదురవుతున్న ఇబ్బందుల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాలి మరి.