Begin typing your search above and press return to search.

భర్తకు బ్రేకప్ చెప్పిన క్రికెట్ బ్యూటీ

By:  Tupaki Desk   |   28 July 2020 12:30 AM GMT
భర్తకు బ్రేకప్ చెప్పిన క్రికెట్ బ్యూటీ
X
ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఎలిస్ పెర్రీ అంటే క్రికెట్ ఫ్యాన్స్ కు తెగ పిచ్చి. తన అందం.. చందంతోపాటు ఆటతోనూ ఈ ముద్దుగుమ్మ క్రికెట్ ఫ్యాన్స్ ను అలరిస్తోంది. క్రికెట్ లోనే అందమైన మహిళా క్రికెటర్ గా ఎలిస్ పెర్రీ గుర్తింపు పొందింది. క్రికెట్ లోనే కాదు.. ఈమె ఆస్ట్రేలియా ఫుట్ బాల్ జట్టులోనూ సభ్యురాలిగా ఎంపికైంది. అయితే క్రికెట్ నే ఎంచుకొని కొనసాగింది.

తాజాగా ఎలిస్ పెర్రీ తన భర్తతో విడిపోయింది. రగ్బీ ఆటగాడు అయిన మౌట్ టమౌను పెర్నీ 2015 డిసెంబర్ లో పెళ్లి చేసుకుంది. ఐదేళ్ల పాటు కలిసి జీవించిన ఈ జంట తాజాగా విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించింది.

ఏడాదిగా వీరిద్దరూ వేరుగా ఉంటున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే పరస్పర గౌరవంతోనే తాము విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు ఆదివారం ఓ ఉమ్మడి ప్రకటనను ఈ జంట చేసింది. అయితే వీరి బ్రేకప్ కు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.