Begin typing your search above and press return to search.

స్టార్ క్రికెటర్ ప్రపోజల్ పై స్పందించిన మహిళా క్రికెటర్

By:  Tupaki Desk   |   4 May 2020 5:30 PM GMT
స్టార్ క్రికెటర్ ప్రపోజల్ పై స్పందించిన మహిళా క్రికెటర్
X
టీమిండియా క్రికెటర్ , చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మురళీ విజయ్ తాజాగా ఓ మహిళా క్రికెటర్ కు ప్రపోజల్ పంపారు. దీనిపై ఆ మహిళా క్రికెటర్ కూడా తనదైన శైలిలో స్పందించింది. వీరిద్దరి సంభాషణ క్రికెట్ వర్గాలు.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

చెన్నై సూపర్ కింగ్స్ తరుఫున ఐపీఎల్ ఆడుతున్న మురళీ విజయ్ ఈ మధ్య దేశంలో లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన లైవ్ సెషన్ లో పాల్గొన్నాడు.ఈ సందర్భంగా మురళీ విజయ్ ని ఏ క్రికెటర్ తో డిన్నర్ చేయాలని ఉందని ప్రశ్నించాడు.

ఈ సందర్భంగా విజయ్ స్పందించాడు. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఎల్లీస్ పెర్రీతోపాటు సహచర ఓపెనర్ శిఖర్ దావన్ పేర్లను విజయ్ చెప్పాడు. ఎల్లీస్ పెర్రి చాలా అందంగా ఉంటుందని.. ఆమెతో ఒక్కసారైనా డిన్నర్ చేయాలని ఉందని ఆసక్తికర కామెంట్స్ చేశాడు.ఇక ఆమె తర్వాత శిఖర్ బెస్ట్ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక దీనిపై నెటిజన్లు కామెంట్ చేశారు. ఇలానే దినేష్ కార్తీక్ మొదటి భార్యను డిన్నర్ కు పిలిచి పెళ్లి చేసుకున్నావని.. మళ్లీ ఈమెను చేసుకుంటావా అని ఎగతాళి చేశారు.ఎల్లీస్ పెర్రీ ప్రేమలో విజయ్ పడిపోయాడని కొందరు కామెంట్ చేశారు.

ఇక విజయ్ తనతో డిన్నర్ చేయాలని ఉందని చేసిన వ్యాఖ్యలపై ఆస్ట్రేలియన్ మహిళా క్రికెటర్ స్పందించారు. ఎల్లీస్ పెర్రీ మాట్లాడుతూ ‘విజయ్ డిన్నర్ ప్రపోజల్ నాకు ఓకే అని చెప్పింది. కానీ బిల్ మాత్రం విజయ్ చెల్లించాలని స్పష్టం చేశారు. అయితే అతను వెనుకాడే మనిషి కాదని.. డిన్నర్ చేస్తే సంతోషం అంటూ విజయ్ కి ఓకే చెప్పింది. వీరిద్దరి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.