Begin typing your search above and press return to search.
షాకింగ్... ఒంటిపై బ్రా, అండర్ వేర్ సైతం విప్పేసి ఆ నటి నిరసన!
By: Tupaki Desk | 12 Oct 2022 7:31 AM GMTఇరాన్ ఇంకా చల్లారడం లేదు. హిజాబ్ తప్పనిసరిగా ధరించడాన్ని వ్యతిరేకిస్తూ ఆ దేశ మహిళా లోకం చేపట్టిన నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పెద్ద ఎత్తున మహిళలు హిజాబ్‌లు తీసేసి ఇరాన్ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నారు. ఈ నిరసనలను ఇరాన్ ప్రభుత్వం అణచివేస్తోంది. ఇప్పటికే 22 మంది మహిళలు మృతి చెందారు.
హిజాబ్ ధరించలేదని నెలన్నర క్రితం మహ్‌సా అమినీ(22) అనే యువతిని ఇరాన్ పోలీసులు తీవ్ర చిత్రహింసలు పెట్టి కొట్టి చంపిన సంగతి తెలిసిందే. నాటి నుంచి ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనల సెగ చల్లారడం లేదు. పైగా ఇరాన్ మహిళల పోరాటానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. తాజాగా ఇరాన్‌కు చెందిన ఓ నటి తన బట్టలు విప్పి తన నిరసనను బహిరంగంగా తెలియజేసింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను సైతం పోస్టు చేయడం గమనార్హం.
ఇరాన్ నటి, నెట్‌ఫ్లిక్స్ సిరీస్ సాక్రెడ్ గేమ్స్‌లో నటించిన ఎల్నాజ్ నోరౌజీ (30) ఇరాన్ మహిళలకు మద్దతుగా నిలిచింది. ఈ క్రమంలో హిజాబ్ ను ధరించిన నోరోజీ తన ఒంటిపై ఉన్న హిజాబ్‌ను, తలపై హిజాబ్ ముసుగును, ఆ తర్వాత తన ఒంటిపై ఉన్న వేర్వేరు డ్రస్సులను ఒకదాని తర్వాత ఒకటి తొలగించేసింది. చివరకు తన ఒంటిపై ఉన్న బ్రా, అండర్‌వేర్‌లను సైతం ఆమె తొలగించడం విశేషం. దీన్నంతా వీడియో రూపంలో ఎల్నాజ్ నోరోజీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఇలా ఒక్కొక్కటిగా తన ఒంటిపై ఉన్న బట్టలన్నీ విప్పేసింది. బ్రాను కూడా తొలగించి తన ఎద సంపదకు తన రెండు చేతులను అడ్డుగా ఉంచింది. చివర్లో.. యాంటీ హిజాబ్ నినాదాన్ని పోస్టు చేసి తన నిరసనను నోరోజీ తెలియజేసింది.
''ప్రతి స్త్రీ.. ప్రపంచంలో ఏమూల ఉన్నా.. ఎక్కడి నుంచి వచ్చినా.. ఎప్పుడైనా, ఎక్కడైనా తనకు నచ్చింది ధరించే హక్కును కలిగి ఉండాలి. ఏ పురుషుడు, ఏ మహిళ ఆమెను వేరే దుస్తులు ధరించమని అడిగే హక్కు ఉండకూడదు'' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎల్నాజ్ నోరోజీ తన సందేశం పోస్టు చేసింది.
ప్రతి ఒక్కరికీ భిన్నాభిప్రాయాలు, విశ్వాసాలు ఉంటాయి. వారిని అంతా గౌరవించాలి. ప్రతి స్త్రీకి తన శరీరంపై నిర్ణయం తీసుకునే అధికారం ఉండాలి. నేను నగ్నత్వాన్ని ప్రచారం చేయడం లేదు.. స్వేచ్ఛను మాత్రమే ప్రచారం చేస్తున్నాను అంటూ ఎల్నాజ్ నోరోజీ తన ఇన్‌స్టా సందేశంలో పేర్కొంది.
కాగా ఇరాన్‌కు చెందిన 30 ఏళ్ల ఎల్నాజ్ నోరౌజీ.. నటించిడానికి ముందు పలు అంతర్జాతీయ బ్రాండ్స్‌కు మోడల్‌గా చేసింది. పర్షియన్ ట్రెడిషనల్ డ్యాన్స్‌తో పాటు భారత్‌లో కథక్‌ను సైతం ఆమె నేర్చుకుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.