Begin typing your search above and press return to search.

ప్రాణస్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం..? స్పందించిన ఎలన్ మస్క్

By:  Tupaki Desk   |   25 July 2022 6:36 AM GMT
ప్రాణస్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం..? స్పందించిన ఎలన్ మస్క్
X
ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడిగా ఎదిగినా కూడా ఎలన్ మస్క్ తన వీక్ నెస్ ను మాత్రం మార్చుకోలేకపోతున్నాడట.. ఎంతో మంది అమ్మాయిలతో ఎఫైర్లు, ఎంజాయ్ లు చేసే ఈ కుబేరుడి ఖాతాలో ఇంకా ఎన్నో చిలక్కొట్టుడు వ్యవహారాలు ఉన్నాయని బయటపడుతున్నాయి. ఎంతో మందికి విడాకులు ఇచ్చిన మస్క్ సీక్రెట్ గా తన ప్రాణ స్నేహితుల భార్యలతోనూ శృంగార లీలలు చేశాడని తాజాగా ఆరోపణలు వచ్చాయి.. ఎలన్ మస్క్ శృగార లోలుడు అని కామెంట్లు చేశారు.ఈయన గూగుల్ కో ఫౌండర్ సెర్గీ బ్రిన్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని నివేదికలు వెలువడ్డాయి. ఈ వివాదంపై ఎలన్ మస్క్ వెంటనే స్పందించాడు.

'ఇందులో ఎలాంటి నిజం లేదని' ఎలన్ మస్క్ క్లారిటీ ఇచ్చాడు. ట్విట్టర్ లో ఈ మేరకు ప్రకటన చేశాడు. 'ఇది మొత్తం అబద్ధం. సెర్గీ , నేను స్నేహితులం. గత రాత్రి పార్టీలో కలిసి ఉన్నాం. నేను నికోల్ ను మూడు సంవత్సరాలలో రెండు సార్లు మాత్రమే కలివాను. అప్పుడు కూమా మా చుట్టుపక్కల చాలా మంది వ్యక్తులు ఉన్నారు. రోమాంటిక్ ఏమీ లేదు' అని ఎలన్ మస్క్ ట్వీట్ చేశాడు.

అక్రమ సంబంధాల విషయంలో ఎలెన్ మస్క్ పేరు ఇప్పటికే బాగా పాపులర్ అవుతోంది. ఇటీవల ఆయన తండ్రి ఎర్రల్ మస్క్ సవతి తల్లి కూతురితో సహజీవనం చేసి ఇద్దరు పిల్లలను కన్నాడన్న విషయం మారుమోగింది. ఆ వేడి తగ్గకముందే ఇప్పుడు ఎలెన్ మస్క్ గురించి ఈ సంచలన విషయం బయటపడింది. తండ్రి బాటలోనే కుమారుడు.. అన్నట్లుగా ఎలెన్ మస్క్ కూడా పలువురు వివాహితులతో సంబంధాలు పెట్టుకున్నాడని విమర్శలు వెల్లువెత్తాయి. ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గె బ్రిన్ భార్య నికోల్ షనహన్ తో ఎఫైర్ అని మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఈ విషయం తాజాగా బయటపడడంతో సెర్గె బ్రిన్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడట. ప్రపంచ వ్యాప్తంగా కుబేరుడిగా పేరు సంపాదించిన ఎలెన్ మస్క్ కాపురాల్లో చిచ్చుపెట్టే ఘనుడని అందరూ విమర్శించారు.

సెర్గెబ్రిన్ 1998లో ల్యారీపేజ్ తో కలిసి గూగుల్ సెర్చింజన్ ను నెలకల్పాడు. ఆ తరువాత గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ కు 2019 వరకు ప్రెసిడెంట్ గా ఉన్నాడు.  2018లో సెర్గెబ్రిన్ తో నికోల్ షనహన్ పరిచయం ఏర్పడింది. ఆ తరువాత ఇదే సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. ప్రపంచ కుభేరుల జాబితాలో ఎలెన్ మస్క్ తో పాటు సెర్గెబ్రిన్ కూడా ఉన్నాడు. ఆయనది 8వ స్థానం. సెర్గెబ్రిన్ ఆస్తుల విలువ 94.6 బిలియన్ డాలర్లు.

అయితే ఎలెన్ మస్క్, సెర్గె బ్రిన్ లు మంచి స్నేహితులు. సుధీర్ఘ కాలంగా వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్నారు. 2008లో ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలెన్ మస్క్ కు చెందిన టెస్లా, స్పేస్ ఎక్స్ కుదేలైంది. దీంతో సెర్గెబ్రిన్ ఆయా సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెట్టి ఆదుకున్నాడు. ఎలెన్ మస్క్ ను ఆర్థికంగా ఆదుకొన్న పాపానికి సెర్గెబ్రిన్ భార్యతోనే ఎలన్ మస్క్ అక్రమ సంబంధం  అని వార్తలు వచ్చాయి.  ఈ విషయం తమకు మెయిల్ ద్వారా అందిందని అమెరికన్ మీడియా తెలిపింది.

అయితే సెర్గీ భార్యతో తనకు ఎలాంటి అక్రమ సంబంధం లేదని.. తాను ఆమెతో రెండు మూడు సార్లు తప్ప కలిసింది లేదని ఎలన్ మస్క్ క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ విషయంపై కార్పొరేట్ సెక్టార్లలో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. ఇప్పటికే ఎలెన్ మస్క్ పై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫైనాన్షియల్ గా ప్రపంచంలో నెంబర్ వన్ అయిన ఆయన పర్సనల్ క్యారెక్టర్ మాత్రం చాలా వరస్ఠ్ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.ఈ వివాదంతో ఎలన్ మస్క్ మరోసారి బుక్కయ్యాడు.