Begin typing your search above and press return to search.
ఎలాన్ మస్క్ పై లైంగిక ఆరోపణలు.. ఆయనేం పాడు పని చేశారు?
By: Tupaki Desk | 21 May 2022 7:30 AM GMTఅపర కుబేరుడు.. టెస్లా అధినేత.. ఈ మధ్యనే ప్రముఖ సోషల్ మీడియా ట్విటర్ ను కొనుగోలు చేసే నిర్ణయాన్ని ప్రకటించటం ద్వారా సంచలనంగా మారిన ఎలాన్ మస్క్ మీద లైంగిక ఆరోపణలు రావటం సంచలనంగా మారింది. ఆయన ప్రయాణించే బిజినెస్ ప్లయిట్ లో పని చేసే ఉద్యోగిని విషయంలో ఆయన లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా చెబుతున్నారు.
దీనికి సంబంధించిన ఒక కథనం మీడియాలో రావటం.. అది కాస్తా సంచలనంగా మారటంతో.. ఎలాన్ మస్క్ రంగంలోకి దిగారు. తన మీద వచ్చిన లైంగిక వేధింపులకు సంబంధించిన వార్తల్ని ఖండించారు.
ఇంతకూ ఎలాన్ మస్క్ మీద వచ్చిన ఆరోపణలు ఏమిటి? అన్న విషయంలోకి వెళ్లినప్పుడు.. దాదాపు నాలుగేళ్ల క్రితం అంటే 2018లో తనకు చెందిన బిజినెస్ ఫ్లయిట్ లో అటెండర్ గా పని చేసే మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపనలు ఉన్నాయి. ఎలాన్ కు చెందిన స్పేస్ ఎక్స్ కార్పొరేట్ జెట్ ఫ్లయిట్ లో కాంట్రాక్టు పద్దతిలో అటెండర్ గా పని చేసే మహిళ మొదట్లో ఎయిర్ హోస్టెస్ గా పని చేసేవారు.
అనంతరం ఆమెను.. మస్క్ కు మసాజ్ చేసే బాధ్యతను అప్పజెప్పినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. 2016లో ఒక రోజు విమానంలో తన గదిలోకి రావాలని ఎలాన్ మస్క్ ఆదేశించటంతో సదరు అటెండెంట్ ఆయన గదిలోకి వెళ్లారు.
అప్పటికే ఫ్లయిట్ లో అర్థనగ్నంగా ఉన్న మస్క్.. ఆమె అనుమతి లేకుండానే కాలిపై తన చేతిని వేసి.. లోబర్చుకునేందుకు ప్రయత్నాలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఒక కథనం మీడియాలో వచ్చింది. దీంతో.. ఈ ఎపిసోడ్ పై ఆయనే రంగంలోకి దిగారు.
తన మీద వచ్చిన ఆరోపణల్ని ఖండించే ప్రయత్నం చేశారు. తన మీద జరుగుతున్న దాడిని రాజకీయ కోణం నుంచి చూడాలన్నారు. మంచి ఫ్యూచర్.. స్వేచ్ఛగా మాట్లాడే విధానాన్ని తెర మీదకు తీసుకొస్తున్న వేళ.. తనపై జరుగుతున్న దాడులన్ని వ్యూహాత్మకమేనన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే వీలుందన్న మాట వినిపిస్తోంది.