Begin typing your search above and press return to search.
పడిపోయిన ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్..!
By: Tupaki Desk | 18 May 2021 9:32 AM GMTప్రపంచంలోనే అత్యంత ధనికుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఎలాన్ మస్క్.. ఒక మెట్టు కిందకు జారిపోయారు. ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ ‘టెస్లా’ అధినేతగా ఉన్న మస్క్.. కొంత కాలంగా టాప్ 2లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా అతన్ని లూయీ వ్యూటన్ అధిపతి బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఓవర్ టేక్ చేశారు.
మస్క్ షేర్ల ధర 2.2 శాతం తగ్గిపోవడమే ఇందుకు కారణం. గత వారం టెక్నాలజీ షేర్లు పడిపోవంతో మస్క్ ఆస్తుల విలువ చాలా వరకు పడిపోయాయి. గత జనవరితో పోలిస్తే.. ఏకంగా 24 శాతం తగ్గాయి. ప్రస్తుతం 160.6 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. ఇండియన్ కరెన్సీలో చూస్తే.. ఈ మొత్తం 12 లక్షల కోట్లకు పైనే!
అయితే.. ఇటీవల లూయీ వ్యూటన్ అమ్మకాలు భారీగా పెరిగాయి. లగ్జరీ గూడ్స్ ను ఈ సంస్థ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. చైనాతోపాటు ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో వీటి అమ్మకాలు పెరగడంతో ఆర్నాల్ట్ ఆదాయం పెరిగింది. దీంతో.. ఆయన నికర ఆస్తుల విలువ 4,700 కోట్ల డాలర్లు పెరిగి 161.2 బిలియన్ డాలర్లకు చేరింది. మస్క్ ఆదాయంతో పోలిస్తే.. ఆర్నాల్ట్ ఆదాయం కొద్దిగానే ఎక్కువ కావడం గమనార్హం.