Begin typing your search above and press return to search.
పుతిన్ కు సవాల్ చేసిన ఎలన్ మాస్క్ పేరు మార్చుకున్నాడు
By: Tupaki Desk | 16 March 2022 1:59 PM GMTటెస్లా చీఫ్ ఎలన్ మస్క్ తన పేరును మార్చేసుకున్నారు. ఎలన్ మస్క్ అన్న పేరులో A అనే అక్షరం జోడించి ఎలానా మస్క్ అయ్యారు. తన అధికారిక సోషల్ మీడియా ట్విట్టర్ అకౌంట్ లో పేరును మార్చుకున్నారు. ఉక్రెయిన్ పై దండెత్తిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ కు ఇటీవల ఎలన్ మస్క్ సవాల్ విసిరాడు. దీనికి చెచెన్యా రిపబ్లిక్ అధినేత రంజాన్ కదిరోవ్ స్పందించారు. ఈ నేపథ్యంలోనే కొన్ని గంటల్లోనే ఎలాన్ మస్క్ తన పేరును మార్చుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రంజాన్ కదిరోవ్ తనపై టెలిగ్రామ్ పోస్ట్ ద్వారా చేసిన వ్యాఖ్యలతో కూడిన కొన్ని స్క్రీన్ షాట్లను మస్క్ పోస్ట్ చేశారు.ఎలాన్ మస్క్ తన పరిధులను అధిగమించుతున్నాడని.. తనను తాను పుతిన్ తో పోల్చుకోవడం సరికాదంటూ రంజాన్ హితవు పలికారు. బాక్సింగ్ రింగ్ లో మస్క్ రెడ్, పుతిన్ బ్లూ కార్నర్లలో ఉన్నారని కదిరోవ్ కామెంట్స్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడైన రాజకీయ నాయకుడు, వ్యూహకర్తతో ఓ వ్యాపారవేత్త తనను తాను పోల్చుకోవడం సమర్థనీయం కాదని పేర్కొన్నారు.
ఎలన్ మస్క్ ఉక్రెయిన్ రష్యా మధ్య భీకరపోరు 21 రోజులుగా కొనసాగుతుండడంతో తనతో పోరాడేందుకు రమ్మంటూ ఎలాన్ మస్క్ సవాల్ విసిరారు. ట్విట్టర్ వేదికగా పుతిన్ కు చాలెంజ్ విసిరారు. రష్యా అధ్యక్ష భవనాన్ని ట్యాగ్ చేశారు. ఈ పోరులో గెలిచిన వారే యుద్ధం కొనసాగాలా? ఆగిపోవాలా? నిర్ణయిస్తారని అర్థం వచ్చేలా ఉక్రెయిన్ లో రష్యా బలగాలు అని ట్వీట్ చేశారు.
ఈ వివాదంలోకి చెచెన్యా నాయకుడు రంజాన్ కదిరోవ్ కూడా దూరి మస్క్ ను ఎగతాళి చేశాడు. ఎలన్ మస్క్ ని ఎలియోనా అని సరదాగా పిలిచాడు. దాని ఫలితంగానే మస్క్ తన పేరును ట్విట్టర్ లో మార్చుకొని సెటైర్లు వేశాడు.