Begin typing your search above and press return to search.

ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్.. ఏక్షణంలోనైనా ప్రకటన?

By:  Tupaki Desk   |   25 April 2022 4:00 PM GMT
ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్.. ఏక్షణంలోనైనా ప్రకటన?
X
సామాజిక మాధ్యమాల్లో ట్విటర్ పాత్ర కాదనలేనది.. సెలబ్రెటీలు వాడే సోషల్ మీడియాగా దీని పేరుంది.. ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్టాగ్రామ్ లతో ట్విటర్ పోటీపడుతోంది.. ఇంకా లోకల్ గా అనేక మాధ్యమాలున్నా అంతర్జాతీయంగా ఇవి తమ ప్రభావం చూపుతున్నాయి. గతంలో అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన ట్రంప్ కూడా ట్విటర్ ఖాతాదారుడే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ట్విటర్ ఖాతా తన ప్రాధాన్యతను పెంచుకుంటోంది. వినియోగదారులను ఆకర్షించేందుకు సిద్ధమవుతోంది.

ట్విటర్ ను కొనుగోలు చేసేందుకు ప్రపంచంలోనే అపర కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ముందుకొచ్చారు. ట్విటర్ వాటాదారుగా ఉన్న మస్క్ దాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకు గాను 13 బిలియన్ డాలర్లు సుమారు రూ.3.22 లక్షల కోట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అయితే దీనిపై ఇంకా బోర్డు నిర్ణయం తీసుకోలేదు. మిగతా వాటాదారులు సరే నంటే ట్విటర్ సంస్థ మస్క్ సొంతం అవుతుందని తెలుస్తోంది.

ఇన్నాళ్లు ఎలాన్ మస్క్ ఆఫర్ ను వ్యతిరేకిస్తూ వచ్చిన ట్విట్టర్ బోర్డు.. తాజాగా మనసు మార్చుకొని ఓకే చెప్పబోతోందా? వేగంగా మారుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అంటున్నాయి మార్కెట్ వర్గాలు. ట్విట్టర్ కొనుగోలుపై ఇరువర్గాలు జరుపుతున్నాయని.. ఏ క్షణంలోనైనా ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. ట్విట్టర్ విక్రయానికి సంబంధించినచర్చల్లో వేగం కనిపిస్తోందని తెలిపాయి.

ట్విటర్ కోసం మస్క్ 9.2 శాతం వాటా కొనుగోలు చేయడంతో ఈ కంపెనీ షేర్ విలువ 39.91 డాలర్ల వద్దే ట్రేడయింది. ప్రస్తుతం ఒక్కో షేరుకు 54 డాలర్లు ఇస్తామని మస్క్ చెబుతున్నారు. కానీ దీనిపై ట్విట్టర్ ఏ నిర్ణయం తీసుకోలేదు. మస్క్ కొనుగోలు ప్రతిపాదనలను ట్విటర్ బోర్డు అంగీకరిస్తుందో లేదో అనే అనుమానాలు ఉన్నాయి. కొందరు మాత్రం మస్క్ ఆఫర్ చేస్తున్న విలువ తక్కువేనని చెబుతున్నారు.

ట్విటర్ యాజమాన్యం మస్క్ ప్రతిపాదనను మన్నిస్తుందో లేదోననే సంశయాలు వస్తున్నాయి. మస్క్ ట్విటర్ ను కొనుగోలు చేయడానికి కారణం భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకునేనని చెబుతున్నారు. ట్విటర్ ను ఒక భారీ సంస్థగా చేయాలనే ఉద్దేశంతోనే దాన్ని కొనుగోలుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. కానీ మస్క్ ప్రతిపాదనను కంపెనీ ప్రతినిధులు ఒప్పుకుంటారా? లేదా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.

ట్విటర్ ను సొంతం చేసుకున్నా అందులో ని విషయం ప్రభావవంతమైందని తెలుసుకున్న మస్క్ దాన్ని మార్చాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. రోజుకు 200 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉండటంతో ట్విట్టర్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తోంది. ట్విటర్ ను మంచి ప్రసార మాధ్యమంగా మార్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.ఇందులో భాగంగానే ట్విటర్ తన రూపురేఖల్ని మార్చాలని మస్క్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

మీడియా రంగంలో కూడా ట్విటర్ తన వంతు పాత్ర పోషిస్తోంది. కళ కోల్పోయిన మీడియా సంస్థలకు కొత్తగా రూపాలను ఆపాదిస్తూ తమ మనుగడ కొనసాగించేలా చేస్తోంది. దీని కోసం అహర్నిశలు శ్రమిస్తోంది. ట్విట్టర్ ఎదుగుదలకు వాక్ స్వేచ్ఛపై నియంత్రణలు ప్రతిబంధకంగా మారాయని ఎలాన్ మస్క్ అభిప్రాయపడుతున్నారు. తాను కొంటే ఆ మార్పులు చేస్తానంటూ ప్రపంచ స్వేచ్ఛ ప్రియులకు పిలుపునిచ్చాడు. అందుకే ట్విటర్ ను సొంతం చేసుకోవాలని మస్క్ భావిస్తున్నారు. భవిష్యత్ లో మంచి సంస్థగా మలిచేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. దీని కోసం ఎంత ఖర్చయినా చేసేందుకు ముందుకు వస్తున్నారు.