Begin typing your search above and press return to search.

మళ్లీ కవలలు.. 9కి చేరిన సంతానంపై ఎలన్ మస్క్ ఘాటు ట్వీట్

By:  Tupaki Desk   |   8 July 2022 5:48 AM GMT
మళ్లీ కవలలు.. 9కి చేరిన సంతానంపై ఎలన్ మస్క్ ఘాటు ట్వీట్
X
ప్రపంచంలోనే నంబర్ కుబేరుడు, టెస్లా సీఈవో ఈ మధ్య వివాదలతో సహవాసం చేస్తున్నాడు. ట్విట్టర్ లో యమ యాక్టివ్ గా ఉండే మస్క్ దాని కొనుగోలు కోసం ప్రయత్నించి ఆపసోపాలు పడ్డారు. వర్ధమాన విషయాలపై స్పందించే ఆయన గురించి అందరూ వెతుకుతూ ఆయన వ్యక్తిగత జీవితంలోని లోటుపాట్లను ఎత్తి చూపుతున్నారు. మస్క్ కు 9మంది సంతానం అంటూ వార్తలు జోరందుకున్నాయి. దీనిపై ఆయనను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు వెల్లువెత్తాయి.

తొమ్మిది మందిని కన్నావా? అంటూ అందరూ ప్రశ్నించేసరికి ఎలన్ మస్క్ ఎట్టకేలకు స్పందించారు. అంతకంతకూ తరిగిపోతున్న జనాభా సంక్షోభానికి సాయంగా తన వంతు కృషి చేస్తున్నా అంటూ ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు.

ఎలోన్ మస్క్‌కి గత సంవత్సరం షివోన్ జిలిస్‌తో కవలలు పుట్టారని ఇన్‌సైడర్ నివేదించింది. అతనికి కవలలు ఉన్నారని, అతనికి మొత్తం సంతానం సంఖ్యతో 9 కి చేరిందని.. ఇది చాలదన్నట్టు ప్రస్తుతం తన కంపెనీలో పనిచేసే ఆపరేషన్స్ మరియు స్పెషల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్‌తో ఉన్నారని నివేదికలు వెలువడ్డాయి.

ఎలోన్ మస్క్ -షివోన్ జిలిస్ లకు నవంబర్ 2021లో కవలలు జన్మించారని సమాచారం. కోర్టు రికార్డుల ప్రకారం, మస్క్ మరియు జిలిస్ కవలల చివరి పేర్లను తమ తండ్రి 'మస్క్'గా మార్చాలని, వారి తల్లి పేర్లను వారి మధ్య పేర్లలో భాగంగా ఉంచాలని ఈ పిటీషన్ లో దాఖలు చేశారు.

ఇటీవల ఎలన్ మస్క్ కుమారుడు ట్రాన్స్ జెండర్ గా మారుతూ తన పేరు చివర 'మస్క్' అనే తండ్రి పేరు వద్దంటూ కోర్టుకు ఎక్కడం ఎలన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇక నుంచి తనకు పుట్టబోయే బిడ్డల పేర్లు తల్లి, తండ్రి ఇంటిపేర్లు కలిసేలా పెట్టాలని డిసైడ్ అయ్యాడు.

ఎలోన్ మస్క్ తక్కువ జనాభా సంక్షోభంలో సహాయం చేయడానికి తన వంతు కృషి చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఇది వైరల్ అయ్యింది. 'అండర్‌పాపులేషన్‌ క్రైసిస్‌కి సహాయం చేయడానికి నా వంతు కృషి చేస్తున్నాను. కూలిపోతున్న జననాల రేటు నాగరికత ఎదుర్కొంటున్న అతి పెద్ద ప్రమాదం. నా మాటలు గుర్తించండి. మార్స్ జనాభా ఇప్పటికీ జీరో పీపుల్. మీకు పెద్ద కుటుంబాలు ఉన్నాయని నేను ఆశిస్తున్నాను ఇప్పటికే జనాభాకు పాటుపడుతున్న వారికి అభినందనలు!' అంటూ తన సంతాన సామర్థ్యంపై నెటిజన్లు షాకిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.