Begin typing your search above and press return to search.

కొన్నాళ్లు ఎలన్ మస్క్ శృంగారం చేయలేదట.. నమ్మండి?

By:  Tupaki Desk   |   27 July 2022 4:59 AM GMT
కొన్నాళ్లు ఎలన్ మస్క్ శృంగారం చేయలేదట.. నమ్మండి?
X
ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు.. టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోసారి తనపై వస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. గూగుల్ కో ఫౌండర్ సెర్గీ బ్రిన్ భార్యతో తనకు ఎఫైర్ ఉందన్న కామెంట్లపై ఘాటు రిప్లై ఇచ్చాడు.

తాజాగా ఒక పార్టీలో గూగుల్ కోఫౌండర్ సెర్గీ బ్రిన్ తో కలిసి ఉన్న ఫొటోను ఎలన్ మస్క్ ట్వీట్ చేశాడు. పైగా ఈ ఫొటో పెట్టి ఇది రెండు గంటల ముందే తీసుకున్న ఫొటో అని కామెంట్ చేశారు. సెర్గీ బ్రిన్ అతడి భార్యకు విడాకులు ఇవ్వడంలో తన పాత్రేమీ లేదని వెల్లడించారు.

సెర్గీ బ్రిన్ భార్యతో తనకు ఎఫైర్.. వారు అందుకే విడిపోయారన్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని చెబుతూ ఈ ఫొటోను ఎలన్ మస్క్ ట్వీట్ చేశాడు. 'సెర్గీ, నేను ఫ్రెండ్స్. నిన్న రాత్రి కలిసి పార్టీ కూడా చేసుకున్నాం. అతడి భార్యను మూడేళ్లలో కేవలం రెండు సార్లు మాత్రమే చూశాను. అది కూడా చాలా మంది సమక్షంలోనే.. రోమాంటిక్ గా మా మధ్య ఏం జరగలేదు' అని ఎలన్ మస్క్ వివరణ ఇచ్చాడు.

ఇక 'తాను కొన్నేళ్లుగా సెక్స్ చేయలేదని' ఎలన్ మస్క్ సంచలన ప్రకటన చేశాడు.అంతేకాకుండా తన స్నేహితుడైన సెర్గీతో పార్టీలో ఎంజాయ్ చేస్తున్న ఓ ఫొటోను పంచుకున్నాడు.

కేవలం క్లిక్స్ కోసమే తనపై తప్పుడు వార్తలను వాల్ స్ట్రీట్ జర్నల్ రాసిందని మండిపడ్డారు. తనపై కావాలనే వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ప్రచారం చేస్తున్నారని మస్క్ ఆరోపించారు. చాలాకాలంగా తాను సెక్స్ కూడా చేయలేదని..ఇవన్నీ ఒట్టి రూమర్లేనని ఎలన్ మస్క్ కొట్టిపారేశాడు.

గూగుల్ కో ఫౌండర్ సెర్గీ బ్రిన్ .. అతడి భార్య షనహాన్ కలిసి ఉండడం లేదని దానికి ఎలన్ మస్క్ తో ఎఫైర్ ఉండడమే కారణమంటూ ప్రచారం జరిగింది. దానిపై వివరణ ఇస్తూనే వస్తున్నాడు ఎలన్ మస్క్. మస్క్ మోకాలిపై కూర్చొని బ్రిన్ భార్యను క్షమాపణ అడిగాడని అప్పుడే తన భార్యకు ఉన్న అఫైర్ గురించి తెలిసిందని.. కాకపోతే వారిద్దరూ ఎక్కువగా మాట్లాడుకోరని మీడియాలో కథనాలు వచ్చాయి.