Begin typing your search above and press return to search.
కష్టాల్లో ఎలన్ మస్క్ .. షేర్లు అమ్మడానికి రంగం సిద్ధం !
By: Tupaki Desk | 10 Nov 2021 3:35 PM GMTప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ కు అనుకోని కష్టం వచ్చి పడింది. రెండు రోజుల్లోనే 50 బిలియన్ డాలర్లు (రూ.3.71 లక్షల కోట్లు) నష్టాపోయాడు. అంతే, మస్క్ ఆస్తి కొవ్వొత్తిలా కరిగిపోయింది. టెస్లా ఇంక్ షేర్లు కూడా వరుసగా రెండో రోజూ అమాంతం పడిపోయాయి. ఇక చేసేది ఏమిలేక మస్క్ కూడా చేతులేత్తేశాడు. నా దగ్గర డబ్బుల్లేవు, షేర్లు అమ్మేయాలని అనుకుంటున్నాను.. మీరు ఏమంటారు చెప్పండి అంటూ నెటిజన్ల అభిప్రాయాన్ని కోరుతూ మస్క్ ట్వీట్ చేశారు.
టెస్లా స్టాక్ లో 10 శాతం విక్రయించాలని భావిస్తున్నట్టు మస్క్ ఈ నెల 7న ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. ఇటీవల వాషింగ్టన్ లో కొంతమంది డెమోక్రాట్లు ఎలన్ మస్క్ లాంటి బిలియనీర్ల పై పన్నులు పెంచాలని ఒత్తిడి చేశారు. బిలియనీర్లు స్టాక్స్ ధర పెరిగినప్పుడు వారు ఎటువంటి షేర్లను విక్రయించకపోయినా పన్నులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి నేను నా టెస్లా స్టాక్ లో 10శాతం విక్రయించాలని అనుకుంటున్నాను. దీనికి మీరు మద్దతు ఇస్తున్నారా అని ఎలన్ ట్విట్ చేశాడు. మొన్నటివరకూ టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీలతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఎలన్ మస్క్ సంపద ఒక్కసారిగా పెరిగిపోయింది. టెస్లా షేర్లు పడిపోవడంతో అమ్మేందుకు మస్క్ సిద్ధమయ్యారు.
అలాగే మస్క్ సోదరుడు కింబాల్ ఈ పోల్ పెట్టడానికి ముందే వాటాలను విక్రయించాడనే వార్తలు వచ్చాయి. దాంతో పెట్టు బడుదారులంతా తమ డబ్బును వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే రెండు రోజుల నుంచి టెస్లా షేర్ ధరలు పడిపోతున్నాయి. నవంబర్ 9న 1,173.60 డాలర్లుగా నమోదైన టెస్లా షేర్ ధర ప్రస్తుతం 1,023.50 డాలర్లకు పడిపోయింది.