Begin typing your search above and press return to search.
ఎలన్ మస్క్ ... 'అంగారకుడి మీద జీవనానికి ఇది సరిపోతుందేమో'
By: Tupaki Desk | 18 Oct 2021 10:54 AM GMTఎలన్ మస్క్...టెస్లా మరియు స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే ధనవంతుల జాబితా లోరెండో స్థానంలో ఉంది. సంపాదించడంలోనే కాదు.. అందులోంచి దానాలు చేయడం ద్వారా కూడా ధనికులు కొందరు శెభాష్ అనిపించుకుంటున్నారు. బిల్ గేట్స్, వారెన్ బఫెట్, మార్క్ జుకర్ బర్గ్ లాంటి అపర కుబేరులు సైతం ఈ లిస్ట్ లో ఉన్నారు. కానీ, ఈ జాబితాలో టాప్ 2 పొజిషన్ లో ఉన్నవాళ్లు మాత్రం, చాలా వెనుకంజలో ఉన్నారు. పైగా వీళ్లిద్దరి వ్యవహార శైలిపై తోటి కుబేరుల తో పాటు ప్రముఖులు సైతం మడిపడుతూనే ఉన్నారు.
ముఖ్యంగా స్పేస్ టూరిజంలో పోటీతో అపర కుబేరులు ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్ లు అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నారు. భూమి మీద ఎన్నో సమస్యల్ని పరిష్కరించే అవకాశం ఉన్నా.. అంతరిక్ష ప్రయోగాల పేరుతో వృధా ఖర్చు చేస్తున్నారనే విమర్శ ఈమధ్య బాగా వినిపిస్తోంది. బిల్‌గేట్స్‌తో పాటు ప్రిన్స్ విలియమ్ లాంటి ప్రముఖులు సైతం విమర్శించిన వాళ్లలో ఉన్నారు. అయితే ఈ విమర్శలపై తాజాగా ఓ రేడియో ఇంటర్వ్యూలో స్పేస్‌ఎక్స్ బాస్ ఎలన్ మస్క్ స్పందించాడు. విమర్శల నేపథ్యంలో మార్పు ఆశించొచ్చా అని రేడియో జాకీ అడిగిన ప్రశ్నకు.. ఆసక్తి-అవకాశం ఉన్నప్పుడు విమర్శలను ఎందుకు పట్టించుకోవడం అంటూ సింగిల్ లైన్ లో విమర్శలకు తన బదులు ఇచ్చాడు.
ఇక క్రిప్టో యూట్యూబర్ మ్యాట్ వాలేస్ ట్విటర్ లో ఎలన్ మస్క్ సంపద గురించి ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. ఎలన్ మస్క్ ప్రస్తుత ఆస్తి 861 బిలియన్ డోజ్ కాయిన్ లకు సమానం. బిల్‌గేట్స్, వారెన్ బఫెట్ ల ఆస్తి కలిస్తే ఎంతో.. అంత ఆస్తి ఇప్పుడు ఎలన్ మస్క్ ఒక్కడికే ఉందన్నమాట అంటూ వాలేస్ ట్వీట్ చేశాడు. అయితే ఆ ట్వీట్ కు ఎలన్ మస్క్ బహుశా.. అంగారకుడి మీద జీవనాన్ని విస్తరించడానికి ఇది సరిపోతుందేమో అంటూ రిప్లై ఇచ్చాడు. అయితే మాట్లాడితే మార్స్ పేరెత్తే ఎలన్ మస్క్.. చిన్నప్పటి కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఇలా చేస్తున్నాడు. టెక్ మేధావిగా ఎదిగినప్పటికీ మార్స్ మీద మనిషి మనుగడ ధ్యేయంగా స్పేస్ ఎక్స్ ను నెలకొల్పి అందుకోసమే కోటాను కోట్ల డాలర్లను వెచ్చిస్తున్నాడు. ఈ క్రమంలో విమర్శలను తాను పట్టించుకోనని చెబుతున్నాడు. అంతేకాదు ఈ వ్యవహారంలో వచ్చే మీమ్స్ ను సైతం ఆస్వాదిస్తుంటాడు.