Begin typing your search above and press return to search.
ఎలన్ మస్క్ బెడ్ పక్కన ఏం ఉంటాయో తెలుసా?
By: Tupaki Desk | 29 Nov 2022 4:28 AM GMTట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్ ఏది చేసినా ఒక వింతే. ఆయన చర్యలు ఊహాతీతంగా ఉంటాయి. దూకుడుగా ముందుకెళుతుంటారు. ఏది చేసినా చిరిగి చాటై వివాదాస్పదమవుతుంటాయి. మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ ను కొన్నాక ఎలన్ మస్క్ చర్యలపై తిట్టని వారు లేరు. ఉద్యోగులను తీసేసి.. ఉన్నతాధికారులను తొలగించి మార్కులతో ట్విటర్ ను నాశనం చేస్తున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ మస్క్ తన ఉబకాయాన్ని బాగా తగ్గించుకొని తాజాగా సన్నబడ్డాడు. ఆయన రహస్యం ఏంటని అందరూ ఆరాతీస్తుండగా ఒక అరుదైన ఫొటోను ఆయన పంచుకున్నారు.
నాలుగు డైట్ కోక్‌లు (కెఫీన్ లేని కోక్), సాంప్రదాయ తుపాకీ రివాల్వర్‌తో తన పడక పక్కన ఉన్న టేబుల్ ఉంచిన చిత్రాన్ని పోస్ట్ చేశారు. "నా పడక పక్కన ఏం ఉంటుందో తెలుసా" అనే శీర్షికతో మస్క్ చిత్రాన్ని పోస్ట్ చేశాడు. "నా కోస్టర్లు లేకపోవడానికి ఎటువంటి కారణం లేదు" అన్నారాయన. మస్క్ పోస్ట్‌పై పలువురు వినియోగదారులు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు..
డైట్ కోక్ లేదా తుపాకీలను ఇష్టపడే వ్యక్తులు ఎడమవైపున ఉన్నారని ఒకరు కొంటె కామెంట్ చేశారు. మరొకరు "మీరు తుపాకీ సంస్కృతికి మద్దతు ఇస్తున్నారా? మీరు మానవత్వం , శాంతికి వాది అని నేను అనుకున్నాను" అని ఈసడించుకుంటున్నారు.
ఈ ఏడాది జూన్‌లో ట్విట్టర్ సీఈఓ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లో డైట్ కోక్స్ పట్ల తన ప్రేమను వ్యక్తం చేశారు. మస్క్ ట్వీట్ చేస్తూ: "డైట్ కోక్ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా సినిమా థియేటర్లలో ఉప్పు & వెన్న పాప్‌కార్న్‌తో కూడిన సోడా ఫౌంటెన్ వెర్షన్" అనిపిస్తోందని అన్నారు. బరువు తగ్గడానికి ఎలన్ మస్క్ వాటినే తాగుతున్నాడు. "ఇది నా ఆయుష్షును తగ్గించినా నేను పట్టించుకోను" అన్నారాయన. "కూల్. మీ ఆయుర్దాయం తగ్గించే ఏదైనా చేయమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను." అంటూ మస్క్ కే కౌంటర్లు ఇస్తున్నారు నెటిజన్లు
"మీరు థియేటర్‌లో చూసిన చివరి సినిమా ఏమిటి?" మరొక వినియోగదారు ప్రశ్నించాడు. మస్క్ దీనికి బదులిస్తూ "డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్."అంటూ సమాధానమిచ్చాడు. ఇలా రాత్రంతా ట్విటర్ వినియోగదారులకు ప్రశ్నలకు ఓపికగా సమాధానమిస్తూ కాలక్షేపం చేశాడు మస్క్.
ఎలన్ మస్క్ తన కంపెనీలను ప్రారంభించే సమయంలో వారానికి 100 గంటలు పని చేసేవాడు. ఒక రోజులో ఎనిమిది క్యాన్ల డైట్ కోక్ , కొన్ని పెద్ద కాఫీలు తాగేవాడని మీడియా గతంలో నివేదించింది. అతడు పూర్తి బరువు తగ్గేందుకు ద్రవపదార్థాలపై ఆధారపడుతున్నాడని.. ఎక్సర్ సైజులు చేస్తూ సన్నగా మారడానికి చూస్తున్నట్టు తెలిసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.