Begin typing your search above and press return to search.

ఫోర్బ్స్ జాబితా: కుబేరుల్లో తొలి స్థానం కోల్పోయి తిరిగి దక్కించుకున్న ఎలన్ మస్క్

By:  Tupaki Desk   |   8 Dec 2022 4:46 PM GMT
ఫోర్బ్స్ జాబితా: కుబేరుల్లో తొలి స్థానం కోల్పోయి తిరిగి దక్కించుకున్న ఎలన్ మస్క్
X
ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో రెండో స్థానానికి దిగజారిన ఎలన్ మస్క్ సాయంత్రానికి షేర్లు పుంజుకోవడంతో తన మొదటి స్తానాన్ని తిరిగి దక్కించుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ అర్నాల్డ్ ఏకంగా ఎలన్ మస్క్ ను అధిగమించి 185.3 బిలియన్ల డాలర్ల నికర సంపదతో మొదటి స్థానంలోకి దూసుకొచ్చాడు. అయితే ఎలన్ మస్క్ 2వ స్థానానికి పడిపోయి మళ్లీ సాయంత్రం అమెరికా మార్కెట్లు ముగిసే సమయానికి ఎలన్ మస్క్ 185.4 బిలియన్ డాలర్లతో మళ్లీ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు.

ట్విటర్ యజమాని మరియు టెస్లా బాస్ ఎలోన్ మస్క్ బుధవారం నాడు ఫోర్బ్స్ ప్రకారం మొదటి స్థానం తృటిలో కోల్పోయి తిరిగి మళ్లీ చేజిక్కించుకున్నారు. ఎలక్ట్రిక్ కార్ల తయారీదారులో తన వాటా విలువ బాగా పడిపోవడం.. ట్విటర్ కోసం $44 బిలియన్ల డాలర్లు వెచ్చిచండంతో ఎలన్ మస్క్ సంపద బాగా పడిపోయింది. ప్రపంచంలోని అత్యంత సంపన్నుడిగా తన బిరుదును ట్విటర్ వల్ల ఎసరు తెచ్చుకున్నారు..

లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్టన్ యొక్క మాతృ సంస్థ LVMH చీఫ్ ఎగ్జిక్యూటివ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ మరియు అతని కుటుంబం క్లుప్తంగా ప్రపంచంలోనే అత్యంత సంపన్నులుగా టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. అయితే ఎలన్ మస్క్ పుంజుకోవడంతో తిరిగి సాయంత్రానికి ఫోర్బ్స్ ప్రకారం $185.3 బిలియన్ల వ్యక్తిగత సంపదతో తిరిగి 2వ స్థానానికి చేరుకున్నారు. .

సెప్టెంబర్ 2021 నుండి ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఎలన్ మస్క్ నికర సంపద $185.7 బిలియన్లు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ నుండి మస్క్ ఈ నంబర్ 1 ర్యాంకును స్వీకరించాడు.

ఈ సంవత్సరం ప్రారంభంలో మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి ఆఫర్ చేసినప్పటి నుండి 47% కంటే ఎక్కువ విలువ కోల్పోయిన టెస్లా షేర్లు ఎలన్ మస్క్ సంపదన కరిగిపోవడానికి కారణమయ్యాయి. ట్విటర్ కోసం 44 బిలియన్ డాలర్లు వెచ్చించడమే మస్క్ సంపద కరిగిపోయేలా చేసింది.

మస్క్ యొక్క నికర విలువ నవంబర్ 8న $200 బిలియన్ల దిగువకు పడిపోయింది. ఎందుకంటే ప్రపంచంలోని అత్యంత విలువైన ఎలక్ట్రిక్-వాహన తయారీ సంస్థ యొక్క టాప్ ఎగ్జిక్యూటివ్ మరియు అతిపెద్ద వాటాదారు ట్విట్టర్‌లో ఎక్కువగా నిమగ్నమై ఉండటంతో ఇన్వెస్టర్లు టెస్లా షేర్లు పతనం అయ్యాయి. అందుకే ఈ కుబేరుడు స్థానం పడిపోతోంది.

ఇక మూడో స్తానంలో భారత కుబేరుడు గౌతం అదానీ నిలిచారు. 4వ స్థానం అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, 5వ స్థానంలో వారెన్ బఫెట్.. మన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 8వ స్థానంలో కొనసాగుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.