Begin typing your search above and press return to search.

ఎలన్‌ మస్క్‌ మరో సంచలన నిర్ణయం ..' టెక్సాస్‌ ఇన్స్టిట్యూట్ '

By:  Tupaki Desk   |   30 Oct 2021 9:41 AM GMT
ఎలన్‌ మస్క్‌ మరో సంచలన నిర్ణయం .. టెక్సాస్‌ ఇన్స్టిట్యూట్
X
ఎలన్‌ మస్క్‌ .. అత్యంత తక్కువ సమయంలోనే తన బుద్ధిబలంతో ప్రపంచ కుబేరుడిగా మారాడు. తన తెలివి తేటలతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మారిన ఎలన్‌ మస్క్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌, సోలార్‌ టెక్నాలజీ, స్పేస్‌ టూరిజం, డ్రైవర్‌ లెస్‌ కారు అంటూ మాట్లాడే ఎలన్‌ మస్క్‌ తొలిసారిగా అకాడమిక్‌ అంశాలపై స్పందించారు. ప్రపంచం మాట్లాడే దానికి కొంచెం భిన్నంగా అవుటాఫ్‌ ది బాక్స్‌ ఆలోచనలు చేయడం ఎలన్‌ మస్క్‌కి అలవాటు. అదే అతని విజయ రహస్యం కూడా. ఇరవై ఏళ్ల క్రితం ఎవరూ నమ్మని సమయంలోనే ఎలక్ట్రిక్‌ వాహనాలదే భవిష్యత్తు అని అంచనా వేశాడు.

స్పేస్‌ టూరిజంకి ఫ్యూచర్‌ ఉందని భారీ పెట్టుబడులు పెట్టింది కూడా తనే. అయితే డ్రైవర్‌ లెస్‌ కారుకి సంబంధించి ఎలన్‌ మస్క్‌ ఎంతగా ప్రయత్నించినా పూర్తి స్థాయిలో దాన్ని అభివృద్ధి చేయడం సాధ్యం కావడం లేదు. ఒక అడుగు ముందుకి అయితే రెండడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది పరిస్థితి. దీంతో తన ఆలోచనలకు తగ్గట్టుగా యువతను కాలేజీ డేస్‌ నుంచే తీర్చిదిద్దడం లక్ష్యంగా వర్సిటీని ఎలన్‌ మస్క్‌ స్థాపించే అవకాశ ఉందని అంచనాలు నెలకొన్నాయి. త్వరలో యూనివర్సిటీ పెట్టాలని అనుకుంటున్నట్టు ఎలన్‌ మస్క్‌ ట్వీట్‌ చేశారు. టెక్సాస్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ పేరుతో కొత్త యూనివర్సిటీ స్థాపించే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించాడు.

విద్యారంగంలో అడుగు పెట్టాలని ఉందంటూ ఎలన్‌ మస్క్‌ తాజా నిర్ణయం పట్ల నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఎలన్‌మస్క్‌కి చెందిన టెస్లాతో పాటు స్పేస్‌ఎక్స్‌ కంపెనీ షేర్లు విపరీతంగా పెరిగాయి. టెస్లా కంపెనీ మార్కెట్‌ క్యాపిటల్‌ విలువ వన్‌ ట్రిలియన్‌ డాలర్లను దాటేసింది. దీంతో ఎలన్‌ మస్క్‌ సంపద ఏకంగా 300 బిలియన్లకు చేరుకుంది. అతని దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. ఈ సమయంలో ఎలన్‌ మస్క్‌ ఎడ్యుకేషన్‌ సెక్టార్‌లోకి అడుగు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.