Begin typing your search above and press return to search.

ట్విటర్ కొనుగోలు రెండు రోజుల్లోనే.. మళ్లీ సంచలన ప్రకటన చేసిన ఎలన్ మస్క్

By:  Tupaki Desk   |   26 Oct 2022 10:50 AM GMT
ట్విటర్ కొనుగోలు రెండు రోజుల్లోనే.. మళ్లీ సంచలన ప్రకటన చేసిన ఎలన్ మస్క్
X
ఎలన్ మస్క్ మళ్లీ ట్విటర్ వెంటపడ్డాడు. ప్రపంచంలోనే నంబర్ 1 మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియాను సొంతం చేసుకునేందుకు అడుగులు వేస్తున్నారు. ట్విటర్ కొనుగోలు ఒప్పందాన్ని మరో రెండురోజుల్లోనే ముగిస్తానని.. శుక్రవారం నాటికి క్లోజ్ చేయబోతున్నట్టు టెస్లా అధినేత, ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఈ మేరకు బ్యాంకర్లకు తెలియజేశారు. ఈ ఒప్పందానికి కావాల్సిన నిధులను సమకూరుస్తున్న బ్యాంకర్లతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా మాట్లాడిన ఎలాన్ మస్క్ ఈ మేరకు హామీ ఇచ్చారు.

బిలియనీర్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాన్ని శుక్రవారం నాటికి ముగించాలని భావిస్తున్నారు. మస్క్ తన ఉద్దేశాన్ని సహ-పెట్టుబడిదారులకు ఇప్పటికే తెలియజేశాడని, ట్విట్టర్ కొనుగోలు ఇష్యూను క్లోజ్ చేయబోతున్నట్టు సమాచారం. ఈ ట్విటర్ డీల్‌కు నిధులు సమకూరుస్తున్న బ్యాంకర్లతో వీడియో కాన్ఫరెన్స్ కాల్ ద్వారా డీల్ అమలు జరగాలని భావిస్తున్నారు.

ట్విట్టర్ డీల్ అక్విజిషన్ రిపోర్ట్ కూడా బ్యాంకులు తుది క్రెడిట్ ఒప్పందాన్ని పూర్తి చేశాయని పేర్కొంది. ఇప్పుడు, డీల్‌ను త్వరలో ముగించడానికి డాక్యుమెంటేషన్‌పై సంతకం చేసే ప్రక్రియ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది.

ఈ ట్విటర్ ఒప్పందం తదుపరి దశకు చేరుకోవడంతో దక్షిణ కొరియాకు చెందిన మిరే అసెట్ ఫైనాన్షియల్ గ్రూప్.. ఎలోన్ మస్క్ ద్వారా ఈ ట్విటర్ కొనుగోలుకు ఆర్థిక సహాయం చేయడానికి సుమారు 300 బిలియన్ల కొరియన్ వోన్‌లను నిధులుగా సమకూర్చాలని యోచిస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

ట్విట్టర్ డీల్‌ను ముగించే గడువు దాదాపుగా సమీపిస్తున్నందున మిరేతో ఈ ఒప్పందం రాబోయే రోజుల్లో ఖరారు కావచ్చని నివేదికలను బట్టి తెలుస్తోంది.

ఈ ట్విట్టర్ కొనుగోలు కోసం ఎలోన్ మస్క్ $46.5 బిలియన్ల ఈక్విటీ , డెట్ ఫైనాన్సింగ్‌ ద్వారా నిధులను సమకూర్చుతున్నాడు. ఇది కాకుండా మోర్గాన్ స్టాన్లీ , బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్పోరేషన్ వంటి బ్యాంకులు $13 బిలియన్ల డాలర్ల నిధులను అందించడానికి ఒప్పుకున్నాయి. ఇంత భారీగా అప్పులు చేసి మరీ ట్విట్టర్ ను కొనడానికి ఎలన్ మస్క్ డిసైడ్ కావడం విశేషం.

ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఒరాకిల్ కార్ప్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్, సౌదీ యువరాజు అల్వలీద్ బిన్ తలాల్ వంటి ఈక్విటీ పెట్టుబడిదారులు కూడా $7.1 బిలియన్లతో ఎలన్ మస్క్ కు సహకరిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మొత్తంగా నిధులు లేక ఆగిపోయిన ట్విటర్ డీల్ ను ఎలాన్ మస్క్ పూర్తి చేయబోతున్నాడు. అతడికి కొరియా, సౌదీ, అమెరికా నుంచి భారీ పారిశ్రామికవేత్తలు డబ్బులు సమకూర్చడం వల్లే మళ్లీ ముందడుగు వేసినట్టు తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.