Begin typing your search above and press return to search.

మనసు మార్చుకున్న మస్క్.. ఉద్యోగులతో మీటింగ్

By:  Tupaki Desk   |   14 Jun 2022 1:47 PM GMT
మనసు మార్చుకున్న మస్క్.. ఉద్యోగులతో మీటింగ్
X
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విటర్ను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొనుగోలు చేసినప్పటి నుంచి ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ట్విటర్ను కొనుగోలు చేసిన తర్వాత మస్క్ తమను ఉద్యోగంలో నుంచి తీసేస్తాడనే భయమే ఎక్కువగా కనిపిస్తోంది. మస్క్ తమను గెటౌట్ అనేకంటే ముందు తామే వేరే జాబ్కి మారిపోవాలనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ ట్విటర్ ఉద్యోగులతో సమావేశమవ్వాలని నిర్ణయించారు. ఈ మీటింగ్ ఈ వారంలోనే జరగనున్నట్లు సమాచారం.

అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విటర్ కొనుగోలు చేసినప్పటి నుంచి ఆ వ్యవహారం ఎటూ తేలడం లేదు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదం దగ్గరే బ్రేక్ పడింది. మూడు నెలల్లో ట్విటర్ యాజమాన్య బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని మస్క్ ఫిక్స్ అయినా.. అది కూడా ఎటూ తేలడం లేదు. మరోవైపు.. మస్క్ ట్విటర్ను హ్యాండోవర్ చేసుకున్నప్పటి నుంచి ఆ సంస్థ ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది. మస్క్ ఎప్పుడు తమను జాబ్ నుంచి తొలగిస్తాడోనని ఆందోళన చెందుతున్నారు. మస్క్ గెటౌట్ అనకముందే తాము ఇంకో జాబ్లో చేరాలనే యోచన చేస్తున్నారు. ప్రస్తుతం ట్విటర్ ఉద్యోగులు అదే పనిలో ఉన్నారని సమాచారం.

ఎలాన్ మస్క్ గత నెలలో 44 బిలియన్ డాలర్లకు మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మస్క్ మొత్తం లిక్విడ్ క్యాష్ రూపంలోనే చెల్లిస్తానన్నాడు. ట్విటర్ డీల్ పూర్తయిన తర్వాత మస్క్ తీసుకొచ్చే కొత్త మార్పులపై ఆ సంస్థ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.

మస్క్ నిర్ణయాలకు భయపడి.. కొంతమంది ట్విటర్ ఉద్యోగులు సంస్థ నుంచి నిష్క్రమించాలని ప్లాన్ చేస్తున్నారట. ట్విటర్ ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని మానేస్తామన్నప్పటికీ బిలియనీర్ ఎంత మాత్రం పట్టించుకోవడం లేదని సమాచారం. మరోవైపు ఉద్యోగులు వెళ్లిపోతే వెళ్లిపని అన్న ధోరణిలో మస్క్ ఉన్నట్లు తెలుస్తోంది. ట్విటర్ ఉద్యోగులు వైదొలగడం పై తాను ఏ మాత్రం ఆందోళన చెందడం లేదని స్పష్టం చేశారు.

కానీ ఇప్పుడు మస్క్ మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ట్విటర్ ఉద్యోగుల తీరు తెలుసుకున్న మస్క్.. వారితో ఓ సారి సమావేశమవ్వాలని నిర్ణయించారు. ఈ సమావేశం ఈ వారంలోనే ఉండనున్నట్లు సమాచారం. ముఖ్యంగా వారిలో ఉన్న భయాలను తొలగించి.. వారందరి దృష్టిని తనవైపు తెచ్చుకునేందుకు ఈ మీటింగ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరాగ్ అగ్రవాల్ సహా టాప్ క్యాడర్ మేనేజ్‌మెంట్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సహా ఎంప్లాయిస్ అందరితోనూ చర్చించనున్నారు. వారి అనుమానాలను నివృత్తి చేయనున్నారు.

వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ఈ భేటీ ఉంటుందని ట్విటర్ యాజమాన్యం తెలిపింది. ట్విటర్ ఉద్యోగులతో ఎలాన్ మస్క్.. భేటీ కావడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉద్యోగులు అడిగే ప్రశ్నలకు మస్క్.. సమాధానాలిస్తారని, అలాగే- స్పామ్ అకౌంట్స్‌పై మస్క్‌కు ఉన్న సందేహాలను ఉద్యోగులు తీరుస్తారని అంటున్నారు.