Begin typing your search above and press return to search.

ట్విట్టర్ కు పోటీగా ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   27 March 2022 11:30 PM GMT
ట్విట్టర్ కు పోటీగా ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం
X
ప్రపంచ కుబేరుడు, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ప్రతిదాంట్లోనూ కొత్తదనం కోసం వెతుకుతుంటాడు. ఆయన ఏం చేసినా అది వినూత్నంగానే చేస్తాడు. సక్సెస్ ను అందుకుంటాడు.ఇప్పటికే అంతరిక్షయానాలతో , విద్యుత్ కార్లతో ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాడు. తాజాగా మరో రంగంలోకి ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాల పనితీరుపై పలు సందర్భాల్లో ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ కొత్త సామాజిక మాధ్యమాన్ని అందుబాటులోకి తీసుకురావడంపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు తెలిపారు.

ట్విట్టర్ లో ఒక ఫాలోవర్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఎలాన్ మస్క్ ఓ కొత్త సామాజిక మాధ్యమాన్ని నిర్మించడంపై ఆలోచిస్తారా? వాక్ స్వాతంత్య్రంతో పాటు స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణకు అవకాశం ఉండి, తక్కువ అసత్య ప్రచారాలకు ఆస్కారం ఉండే ఓవేదికను అందుబాబులోకి తీసుకురండి. అలాంటి వేదిక ఇప్పుడు అవసరమని భావిస్తున్నానని ప్రణయ్ పటోలే అనే ఫాలో వర్ తాజాగా మస్క్ ను ట్విట్టర్ లో అదిగారు.

ఈ క్రమంలోనే దీనిపై 'తాను తీవ్రంగా ఆలోచిస్తున్నానని' ఎలన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే వాక్ స్వాతంత్ర్య సూత్రాలను విస్మరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కుతున్నారంటూ పలు సందర్భాల్లో సోషల్ మీడియాపై విరుచుకుపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ లో ప్రజాస్వామ్య వాక్ స్వాతంత్ర్య హక్కుపై పోల్ కూడా పెట్టారు. ట్విట్టర్ లో ప్రజాస్వామ్య వాక్ స్వాతంత్ర్యం లేదని ఏకంగా 70.4 శాతం మంది అన్నారు. దీంతో కొత్త సోషల్ మీడియాకు ఎలన్ మాస్క్ సిద్ధమవుతున్నట్టు తెలిసింది.