Begin typing your search above and press return to search.
వావ్.. మస్క్ నోట శ్రీమంతుడి మాట!
By: Tupaki Desk | 1 Jan 2022 11:30 PM GMTఊరు మనకు చాలా ఇచ్చింది. మనము కూడా కొంత తిరిగి ఇవ్వాలి. లేదంటే లావైపోతారు. ఇదెక్కడో విన్నట్టుంది కదా. అదేనండి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రంలోనే ఫేమస్ డైలాగ్. అప్పట్లో ఈ మాట చాలామందిని కదిలించింది. ఎంతోమంది కూడా తమ ఊరును బాగు చేసుకోవడానికి ఆదర్శంగా నిలిచింది. అయితే ప్రపంచ టాప్ సంపన్నుడైన ఎలన్ మస్క్ కూడా ఈ డైలాగ్ చెప్పాడు. అంటే ఈ రిథమిక్ లో కాదు కానీ ఇదే అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడారు. మస్క్ మాట్లాడిన ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ఎలన్ మస్క్... ఇటీవల స్కూల్ విద్యార్థులకు కొన్ని సందేశాలు ఇచ్చారు. అందులో భాగంగా సొసైటీ డెవలప్ మెంట్ గురించి కూడా మాట్లాడారు. సమాజం కోసం మనవంతుగా పాటుపడాలని ఎలన్ మస్క్ విద్యార్థులకు సూచించారు. వ్యక్తిగత ప్రాధాన్యతలను తగ్గించుకొని సమాజానికి ఉపయోగపడే పనులను చేయాలని అన్నారు. అంతేకాకుండా సమాజం నుంచి మనం ఎంత పొందుతున్నామో అంతకు మించి తిరిగి ఇవ్వాలని పేర్కొన్నారు. నిరంతరం అభ్యసనం వల్ల ప్రపంచనలుమూలలా రోజూ ఏం జరుగుతుందో అవగాహన పెంచుకోవాలని చెప్పారు. అన్ని అంశాలపై కనీస అవగాహన ఉండాలని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
సోషల్ సర్వీసుతో పాటు ఉద్యోగుల నైపుణ్యాలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల విద్యార్హతల కంటే వారి ప్రతిభ, సామర్థ్యానికే అధిక ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. సమాజానికి ఎంతో కొంత చేయాలని మస్క్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. తెలుగు సినిమాలోని డైలాగ్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మస్క్ నోట శ్రీమంతుడి మాట విని.. తెలుగు సినిమా డైలాగులు చాలా పాపులర్ అయ్యాయని అంటున్నారు.
ఎలన్ మస్క్.. అతి తక్కువ కాలంలో తనదైన ఆలోచన విధానంతో టాప్ శ్రీమంతుడిగా ఎదిగారు. ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లాను ప్రారంభించి ఎన్నో అద్భతాలు సృష్టించారు. స్పేస్ ఎక్స్ సీఈవోగా తనదైన రీతిలో సంస్థలను విస్తరిస్తున్నారు. ప్రపంచంలో టాప్ సంపన్నుడిగా నిలిచిన ఈయన సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్ గా ఉంటారు. కరెంట్ అఫైర్స్ పై తనదైన రీతిలో స్పందిస్తారు. జనాలకు దగ్గర కావడం కోసం చాలా ప్రయత్నాలే చేస్తారు.