Begin typing your search above and press return to search.
ట్రంప్ కు మస్క్ మద్దతు... ట్విట్టర్ ఖాతా ఓపెన్!
By: Tupaki Desk | 11 May 2022 6:28 AM GMTవివాదాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్రం.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నోరు విప్పితే... వివాదాలు నిప్పు కణికల్లా వచ్చిపడతాయి. ఎవరిపైనా.. ఆయన ప్రేమ చూపించరు. ఎవరినీ నెత్తినా పెట్టుకోరు. అవసరం.. అవకాశం.. బట్టి కాదు.. ఆయన మూడ్‌ను బట్టి మాట్లాడేస్తారు. కనీసం వెనుకా.. ముందుకూడా చూసుకోరు. నెత్తిన పెట్టేసుకున్నా.. నేలకు విసిరికొట్టినా.. ట్రంప్ స్టయిలే వేరు. అందుకే.. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు భరించలేక.. ఆయన ట్విట్టర్ ఖాతాను ఏకంగా.. నిషేధించిన.. మూసేసిన సంగతి తెలిసిందే.
అయితే.. ఎన్ని వివాదాలు చేసినా.. ఎంత నోట దురుసు చూపించినా.. అదేంటో కానీ.. ట్రంప్ ట్విట్టర్ ఖాతా ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండేది. ఆయనకు ఉన్న ఫాలో వర్లు అంతా ఇంతా కాదు. అయినా.. కూడా ఆయన నోటి దూల కారణం.. ఖాతా క్లోజ్ అయిపోయింది. అయితే.. రెండేళ్ల తర్వాత.. ఇప్పుడు.. డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరణపై మరోమారు చర్చ మొదలైంది. అందుకు ట్విట్టర్ను కొనుగోలు చేసిన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తాజాగా చేసిన వ్యాఖ్యలే కారణంగా కనిపిస్తున్నాయి.
ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరణపై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం పూర్తయితే.. ట్రంప్ ఖాతాను పునరుద్ధరిస్తామని సూత్రప్రాయంగా తెలిపారు. ఫైనాన్షియల్ టైమ్స్ నిర్వహించిన కార్ల భవిష్యత్తు కార్యక్రమంలో ఈ విషయంపై మాట్లాడారు మస్క్. శాశ్వతంగా నిషేధం విధించటం తప్పుడు నిర్ణయమని, అది ట్విట్టర్పై విశ్వాసాన్ని తగ్గిస్తుందన్నారు.
''చాలా స్పష్టంగా, మూర్ఖంగా ఉన్నందున అది నైతికంగా తప్పుడు నిర్ణయంగా భావిస్తాను. తప్పుడు, చెడు ట్వీట్లు ఉంటే.. వాటిని తొలగించటం లేదా కనిపించకుండా చేయటం వంటి చర్యలు తీసుకోవాలి. కానీ, శాశ్వతంగా నిషేధించకూడదు. డొనాల్డ్ ట్రంప్ ఖాతాపై నిషేధం విధించటం సరైంది కాదని నేను భావిస్తాను. అది పొరపాటు అని నేను అనుకుంటున్నాను. దాంతో దేశంలోని చాలా వర్గాలను దూరం చేసింది.'' అని మస్క్ అన్నారు.
ట్విట్టర్ ను కొనుగోలు చేసేందుకు 44 బిలియన్ డాలర్ల ఒప్పందానికి ఆ సంస్థ బోర్డ్ డైరెక్టర్లు గత నెల అంగీకారం తెలిపారు. ఇంకా రెగ్యులేటరీ ఆమోదం కావాలి. ఈ క్రమంలోనే ట్విట్టర్ ను కొనుగోలు చేయాలని మస్క్ కు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారని వార్తలు వచ్చాయి. అయితే, ఈ వ్యాఖ్యలను మస్క్ ఖండించారు. ఈ విషయంపై తానెప్పుడూ ట్రంప్తో మాట్లాడలేదని స్పష్టం చేశారు.
ట్రంప్ తో ప్రత్యక్షంగా, పరోక్షంగా గానీ తానెప్పుడూ మాట్లాడలేదన్నారు. ఆ తర్వాత ట్విట్టర్తో ఒప్పందం తర్వాత ట్రంప్ ను తిరిగి సోషల్ మీడియా లోకి తీసుకొస్తారంటూ వార్తలు వెలువడ్డాయి. వీటి పై ట్రంప్ స్పందించారు. 'వ్యక్తిగతంగా నాకు మస్క్ అంటే చాలా ఇష్టం. అయితే ట్విట్టర్ నాపట్ల ప్రవర్తించిన తీరుపై నేను అసంతృప్తి చెందాను. ఒక వేళ నన్ను ట్విట్టర్లోకి అనుమతించినా నేను మాత్రం రాను.' అని స్పష్టం చేశారు.