Begin typing your search above and press return to search.

టెస్లాను మూసివేస్తామన్న ఎలాన్ మస్క్ .. కారణం ఇదే !

By:  Tupaki Desk   |   22 March 2021 9:30 AM
టెస్లాను మూసివేస్తామన్న ఎలాన్ మస్క్ .. కారణం ఇదే !
X
చైనాలో తమ కార్లు గూఢచర్యానికి పాల్పడితే కనుక తమ కంపెనీని మూసివేస్తామని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. చైనాలోని మిలిటరీ కేంద్రాల పరిధిలో టెస్లా కార్యకలాపాలను నిషేధించినట్లు వార్తలు ప్రసారం అయ్యాయి. ఈ కారణంతో ఎలాన్ మస్క్ శనివారం ఈ అంశంపై స్పందించారు. కేవలం చైనాలోనే కాదని, ప్రపంచంలో ఎక్కడైనా టెస్లా కారు నిఘా చర్యలు చేపట్టినట్లు రుజువైతే తమ కార్ల తయారీ సంస్థను మూసివేస్తామని తెలిపారు. ఈ మేరకు చైనా సంస్థ నిర్వహించిన వర్చువల్ సెమినార్ ‌లో మాట్లాడారు. చైనాలోని మిలిటరీ కేంద్రాల పరిధిలో టెస్లా కార్యకలాపాలను నిషేధించినట్లుగా ప్రచారం జరిగింది. టెస్లా వాహనాలను మిలిటరీ ప్రాపర్టీకి బయట పార్క్ చేయాలని సూచించినట్లు వార్తలు వచ్చాయి. ఈ టెస్లా కార్లలోని కెమెరాలను చైనాపై గూఢచర్యానికి ఉపయోగిస్తున్నారనే ఆందోళనతో ఈ నోటీసులు ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. మల్టీ డైరెక్షన్ కెమెరాలు, అల్ట్రాసోనిక్ సెన్సార్స్ లొకేషన్స్‌ ను బహిర్గతం చేస్తాయని, కాబట్టి రహస్య సైనిక సమాచార భద్రతను నిర్ధారించేందుకు ఈ కార్లను సైనిక నివాసాల నుండి నిషేధిస్తున్నట్లు తెలిపింది.

టెస్లా ఇంక్ సంస్థ తన కార్ల‌లో కెమెరాల‌ను ఇన్‌ స్టాల్ చేసింద‌ని, దీంతో త‌మ భ‌ద్ర‌త‌కు ముప్పు ఉందనే కారణంతో ఆ సంస్థ కార్ల‌ను త‌మ కాంప్లెక్స్‌ ల్లోకి ప్ర‌వేశించ‌డానికి వీల్లేద‌ని చైనా మిలిట‌రీ నిషేధాజ్ఞ‌లు విధించిన‌ట్లు ప్రచారం సాగింది. అమెరికా అధ్య‌క్షుడిగా జో బైడెన్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత రెండు దేశాల మ‌ధ్య వివాదాస్ప‌ద అంశాల‌ను ప‌రిష్క‌రించుకునే విష‌య‌మై ఇరు ప‌క్షాల అగ్ర‌శ్రేణి దౌత్య‌వేత్త‌లు అల‌స్కాలో తొలిసారి ముఖాముఖీ చ‌ర్చ‌లు జ‌రుపుతున్న వేళ ఈ ఆరోప‌ణ‌లు రావ‌డం గ‌మ‌నార్హం. తమ కార్లు గూఢచర్యం చేస్తే టెస్లాను మూసివేస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే, అమెరికా, చైనా మ‌ధ్య ప‌ర‌స్ప‌ర విశ్వాసం అవ‌స‌రమన్నారు. ఈ వ‌ర్చువ‌ల్ స‌ద‌స్సును చైనా విదేశాంగ‌శాఖ మండ‌లి ఆధ్వ‌ర్యంలోని ఫౌండేష‌న్ సంస్థ నిర్వ‌హించింది. చైనా అతిపెద్ద కార్ల మార్కెట్‌ గా నిలిచింది. ప్ర‌త్యేకించి విద్యుత్ కార్ల విక్ర‌యానికి వివిధ కార్ల సంస్థ‌ల మ‌ధ్య పోటీ ఉంది.

ఈమధ్యనే ప్రపంచ కుబేరుడిగా అవతరించిన ఎలాన్ మస్క్.. తాను చేసిన ట్వీట్ వల్ల భారీ నష్టాన్ని చూశారు. అంతకుముందు ప్రపంచ కుబేరుడిగా ఉన్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంపాదనను మించిపోయిన ఎలాన్ మస్క్.. ఆ స్థానంలో ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. ఎలాన్ మస్క్ చేసిన ఒక్క ట్వీట్ తో 15.2మిలియన్ల డాలర్ల నష్టపోవడంతో ప్రపంచం కుబేరుడి స్థానాన్ని చేజార్చుకోగా (బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్) జెఫ్ బెజోస్ తిరిగి ప్రపంచ కుబేరుడి స్థానంలో నిలిచారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఎలాన్ మస్క్ నికర సంపద 183మిలియన్ డాలర్లు కాగా.. బెజోస్ నికర సంపద 186 మిలియన్లుగా ఉంది. అటు ఈ ఏడాది జో బెజోస్, ఎలాన్ మస్క్ ల మధ్య ప్రపంచ కుబేరుడి పీఠంకై పోటీ కొనసాగుతోంది. ఎలాన్ మస్క్ రాకెట్ కంపెనీ స్పేస్ ఎక్స్ ఒక్క ఆగష్టు నెలలోనే 74మిలియన్ డాలర్ల నుండి 60శాతం పెరిగి దాదాపు 850మిలియన్ డాలర్లను సమీకరించింది. దీంతో జో బెజోస్ స్థానాన్ని ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్నారు. అయితే మస్క్ చేసిన ట్వీట్ అతడిని తిరిగి నెంబర్ 2గా చేసింది.