Begin typing your search above and press return to search.

'నేను అనుమానాస్ప‌దంగా చ‌నిపోతే..' ఎలాన్ మ‌స్క్ సంచ‌ల‌న ట్వీట్‌

By:  Tupaki Desk   |   9 May 2022 10:56 AM GMT
నేను అనుమానాస్ప‌దంగా చ‌నిపోతే.. ఎలాన్ మ‌స్క్ సంచ‌ల‌న ట్వీట్‌
X
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్.. తాజాగా చేసిన ఓ ట్వీట్ సంచలనంగా మారింది. 'అనుమానాస్పద మరణం' అంటూ చేసిన ట్వీట్ చర్చకు దారి తీసింది. ఆ ట్వీట్ వెనక ఉన్న ఆంతర్యమేమిటి? రష్యా నుంచి మస్క్కు ప్రాణహాని ఉందా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ఇటీవలే ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ను కొనుగోలు చేశారు. ఆ తర్వాత కొకకోలా, మెక్డొనాల్డ్ వంటి ప్రముఖ సంస్థలను కొనుగోలు చేస్తున్నట్లు ట్వీట్ చేసి షాక్ ఇచ్చారు. ఇలా ఎప్పటికప్పుడు తన ట్వీట్లతో అందరినీ ఆశ్చర్యపరుస్తారు మస్క్. తాజాగా అనుమానా స్పద పరిస్థితుల్లో మరణంపై.. మస్క్ చేసిన మరో ట్వీట్ చర్చకు దారితీసింది.

"నేను అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతే.. మీ అందరితో పరిచయం అయినందుకు సంతోషం.'' అని మ‌స్క్ కొన్ని గంట‌ల ముందు ట్వీట్ చేశారు. ఇది క్ష‌ణాల్లోనే వైర‌ల్ అయింది. అదేస‌మ‌యంలో కామెంట్లు కూడా ప‌డ్డాయి.

ఇక‌, మ‌స్క్ చేసిన ఈ పోస్టుకు ఒక గంట ముందు.. 'ఉక్రెయిన్లోకి ఫాసిస్ట్ దళాలతో పాటు కమ్యూనికేషన్ సామగ్రిని పంపించటంలో మీ భాగస్వామ్యం ఉంది. దీనికి మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది.' అంటూ రష్యన్ అధికారి పంపిన సందేశాన్ని షేర్ చేశారు మస్క్. ఈ సామగ్రి ఉక్రెయిన్కు అమెరికా ర‌క్ష‌ణ శాఖ పెంటగాన్ పంపించినట్లు పేర్కొన్నారు రష్యన్ అధికారి.

ఈ రెండు పోస్టులతో.. యుద్ధం కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్కు సాయం చేయటం వల్ల మస్క్కు రష్యా నుంచి బెదిరింపులు వస్తున్నాయా? అనే విషయంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఉక్రెయిన్లో స్పేస్ఎక్స్ స్టార్లింక్ శాటిలైట్ బ్రాడ్బాండ్ సేవలు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమయ్యాయి. యుద్ధం జరుగుతున్న క్రమంలో శాటిలైట్ బ్రాడ్బాండ్ సేవలు ప్రారంభించటంపై రష్యా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ రెండు ట్వీట్లను బ్యాక్ టు బ్యాక్ చెక్ చేసిన తర్వాత, యుద్ధంలో ఉక్రెయిన్‌కు సహాయం చేసినందుకు టెస్లా సీఈవో రష్యా నుండి బెదిరింపులను ఎదుర్కొంటున్నారా అని నెటిజన్లు భావిస్తున్నారు. కొన్ని నెలల క్రితం, ఉక్రెయిన్‌ నుండి ఒక మంత్రితో చ‌ర్చించిన తర్వాత మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవ‌లో వేగం పెంచింది.

తన ప్రభావ శక్తిని చూపించడమే కాకుండా, మర్మమైన పరిస్థితుల్లో మరణంపై ఆయన ఈరోజు చేసిన ట్వీట్ భారీగా వైరల్‌గా మారింది. అయితే.. ఈ ట్వీట్‌పై జోకుల నుండి జాగ్రత్త వరకు మిశ్రమ ప్రతిస్పందనలు వ‌చ్చాయి. ఇంతలో, ఎలోన్ మస్క్ గత కొన్ని నెలలుగా ముఖ్యాంశాలను ప్ర‌స్తావించాడు, ఈ సమయంలో ఆయ‌న‌ స్వేచ్చా ప్రసంగం కోసం ట్విటర్‌ను కుదించడాన్ని విమర్శించ‌డం గ‌మ‌నార్హం.