Begin typing your search above and press return to search.

ట్విట్ట‌ర్‌ను ముంచేస్తున్న మ‌స్క్‌.. నెటిజ‌న్ల కామెంట్స్‌

By:  Tupaki Desk   |   22 Jan 2023 11:30 PM GMT
ట్విట్ట‌ర్‌ను ముంచేస్తున్న మ‌స్క్‌.. నెటిజ‌న్ల కామెంట్స్‌
X
త‌న దుందుడుకు నిర్ణ‌యాల‌తో ప్ర‌పంచ కుబేరుడు ఎల‌న్ మ‌స్క్ ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక ల‌క్ష‌ల మంది ఆన్‌లైన్ పెట్టుబ‌డి దారుల‌ను ముంచేశారు. ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యంతో జోడి కాయ‌న్ కొనుగోలు దారులు ఇప్పుడు దిక్కులు చూస్తున్నారు. ఇక‌, ఇప్పుడు ప్ర‌పంచ ప్రసిద్ధ ట్విట్ట‌ర్‌పైనా త‌న నిర్ణ‌యాలు రుద్దుతూ.. దీనిని కూడా ఒక దారి చేయ‌డం ఖాయ‌మ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఇప్ప‌టికే ట్విట్ట‌ల‌ర్ బ్లూటిక్ పెట్టి అనేక మంది యూజ‌ర్ల‌ను తిక‌మ‌క‌కు గురి చేసిన మ‌స్క్ మరిన్ని మార్పులు చేయ‌నున్న‌ట్టు సంకేతాలు ఇస్తున్నారు. ట్విట్ట‌ర్ సీఈఓగా ఉన్న‌ ఎలన్ మస్క్ శ‌నివారం చేసిన ట్వీట్‌లో ట్విట్ట‌ర్లో వాణిజ్య ప్రకటనలు చాలా తరచుగా వస్తున్నాయని, అతి పెద్దగా ఉంటున్నాయని తెలిపారు. రానున్న వారాల్లో ఈ రెండిటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రకటనలు లేకుండా అత్యధిక ధరతో కూడిన సబ్‌స్క్రిప్షన్ ఉంటుందన్నారు.

అంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌కు వేదిక‌గా ఉన్న ట్విట్ట‌ర్‌.. ఇక‌పై వ్యాపార వ‌స్తువు కానుంది. అదేస‌మ‌యంలో ఈ కొత్త ట్విట్ట‌ర్ బ్లూ టిక్‌ వివరాలు పూర్తిగా వెల్లడికాలేదు. మ‌రోవైపు ట్విట్ట‌ర్‌కు వచ్చే ఆదాయంలో 90 శాతం ఆదాయం డిజిటల్ యాడ్స్ సెల్లింగ్ వల్ల వస్తోందని, ఇటీవల ఈ ఆదాయం బాగా తగ్గిందని మస్క్ చెప్తున్నారు.

అయితే, 2023నాటికి ప్రకటనలు లేనటువంటి హయ్యర్ టైర్ అందుబాటులోకి వస్తుందన్నా.. దీనికి యూ జ‌ర్లు సిద్ధంగా ఉండాల‌ని చెప్పారు. అంటే.. ఇక‌పైట్విట్ట‌ర్ వినియోగ‌దారుల‌పై ఆయ‌న వ‌డ్డ‌న‌ల‌కు దిగే అవ‌కాశం క‌నిపిస్తోంది. మ‌రోవైపు యాడ్స్ కార‌ణంగా.. ఇప్ప‌టికే ఇన్ స్టా గ్రామ్ వినియోగం భారీగా త‌గ్గిపో యింది.

ట్విట్ట‌ర్‌లో తక్కువ ప్రకటనలు ఉండ‌డంతో దీనికి యూజ‌ర్లు అల‌వాటు ప‌డ్డారు. అయితే.. ఇప్పుడు యాడ్ల కోస‌మే ట్విట్ట‌ర్ అన్న‌ట్టుగా ఉండ‌డంతో మ‌స్క్‌పై నెటిజ‌న్లు దుమ్మెత్తి పోస్తున్నారు. నీ వ్య‌వ‌హారంతో ట్విట్ట‌ర్ కూడా మునిగిపోతుంద‌ని వ్యాఖ్యానిస్తున్నారు.